తెలంగాణ రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్న బోనాల పండగా ఇవాళ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. నేడు, రేపు పాతబస్తీలోని ప్రధాన ఆలయాల్లో బోనాలు పెద్ద ఎత్తున జరుగనున్నాయి. అంబర్ పేట్ లోని మహంకాళి ఆలయంలో ఇవాళ( ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి 18( మంగళవారం) తేదీ వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. దీంతో హైదరబాద్ లో నగర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఈ రూట్లో వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
Read Also: Janasena: ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశానికి జనసేనకు ఆహ్వానం
ఇవాళ ఉదయం 6 గంటల నుంచి జులై 18వ తేదీ ఉదయం 6 గంటల వరకు పలు రూట్లలో దారి మళ్లింపు చర్యలు అమలులోకి ఉంటాయని సిటీ పోలీసులు తెలిపారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వెహికిల్స్ ఉప్పల్ x రోడ్డులో హబ్సిగూడ-తార్నాక-అడిక్‌మెట్-విద్యా నగర్-ఫీవర్ హాస్పిటల్- టీవై మీదుగా మళ్లీస్తున్నారు. మండలి-టూరిస్ట్ హోటల్ జంక్షన్-నింబోలిఅడ్డ-చాదర్‌ఘాట్, సీబీఎస్ రిటర్న్ వచ్చే రూట్లలో వైస్ వెర్సాగా ఉంటుంది.
Read Also: Wine Shops: తెలంగాణలో రెండు రోజుల పాటు వైన్ షాప్స్ బంద్..
కోఠి నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వెహికిల్స్, సిటీ బస్సులు నింబోలిఅడ్డ-టూరిస్ట్ హోటల్-టీవై మండలి-ఫీవర్ హాస్పిటల్ అడిక్‌మెట్-తార్నాక-హబ్సిగూడ-ఉప్పల్ X రోడ్ల మీదుగా తిరుగు మార్గంలో దారి మళ్లీస్తున్నారు. ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ – మల్లికార్జున నగర్ – డిడి కాలనీ – సిండికేట్ బ్యాంక్ శివం రోడ్ వైపుకు దారి మళ్లీంచారు. గోల్నాక, మూసారాంబాగ్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను సీపీఎల్ వైపు మళ్లిస్తున్నట్లు పోలీసుల పేర్కొన్నారు. అంబర్‌పేట్ – సల్దానా గేట్ – అలీ కేఫ్ X రోడ్లు, తిరుగు మార్గంలో వైస్ వెర్సా వైపుకు పంపిస్తున్నారు.
Read Also: LIVE : ఆషాఢ ఆదివారం నాడు ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య బాధలు తొలగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి
అయితే, ఈ రూట్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలుంటాయని, ఎటువంటి అడ్డంకులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సిటీ పోలీసులు ప్రజలకు తెలియజేశారు. కాగా, ఈ రెండు రోజులు కూడా హైదరబాద్ నగరంలో మద్యం షాపులు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం రోజునే మద్యం షాపుల ముందు భారీగా మందుబాబులు మద్యం కొనుగోలు చేశారు.