హైదరాబాద్లో షాకింగ్ ఘటన జరిగింది. సరూర్ నగర్లో జీఎస్టీ సీనియర్ అధికారిపై దాడి చేసి అతడిని కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ క్రమంలో పోలీసులు కిడ్నాప్ను చేధించారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీఎస్టీ సీనియర్ అధికారి మణిశర్మ కిడ్నాప్ చేశారు.
వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలంలోని మల్కాపూర్కు చెందిన మనోహర్ అనే విద్యార్థి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం మధ్యాహ్నం తన మొబైల్ వాట్సాప్లో 'ఐ మిస్ యూ ఫ్రెండ్స్' అని స్టేటస్ పెట్టి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పదేళ్ల క్రితం తల్లి చనిపోవడంతో తండ్రి తాగుడుకు బానిస కావడంతో కుటుంబంలో గొడవల కారణంగా అన్నతో మాటల్లేకపోవడంతో తనకి ఎవరూ లేరు అనే మనోవేదనకు గురైన ఇంటర్ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వైన్స్ షాప్ లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కనకదుర్గ వైన్స్ లో మద్యం సేవించడానికి వచ్చిన నాగి అనే వ్యక్తి.. మద్యం సేవించి షాప్ లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. షాప్ సిబ్బంది కాళ్లు, చేతులు పట్టి రోడ్డుపై పడేశారు.. దీంతో సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
President Droupadi Murmu: హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకిముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట.. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్,
కరీంనగర్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి వేళ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరోవైపు హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లిలో సోమవారం అర్థరాత్రి ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు, బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్కు రానున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆమె హాజరుకానున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్ఫోర్టుకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముర్ము నేరుగా రాష్ట్రపతి నిలయానికి వెళ్తారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ముండ్కా ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. ఆ బాలిక వయస్సు 16 సంవత్సరాలు. అత్యాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు బ్లాక్మెయిలింగ్ కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి పేరు సల్మాన్. అతని వయస్సు 22 సంవత్సరాలు. ఈ అత్యాచార ఘటన జూన్ 29న చోటు చేసుకుంది.
వారు ఎక్కాల్సిన రైలు రాలేదని కాస్త విశ్రాంతి తీసుకుంటున్న ప్రయాణికులపై ఓ రైల్వే పోలీస్.. అమానవీయంగా ప్రవర్తించాడు. రైల్వే ప్లాట్ ఫామ్ పై పడుకున్న ప్రయాణికులపై నీళ్లు చల్లి లేపాడు. అయితే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఖలీల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఖలీల్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కు ఖలీల్ మధ్య గత కొంత కాలంగా గొడవలున్నాయి. ఈ గొడవల కారణంగానే ఖలీల్ ను ఉస్మాన్ చంపేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పోలీసులు మానవత్వం చాటుకున్నారు. గ్రూప్-4 పరీక్ష రాయడానికి భార్యభర్తలు ఇద్దరు వచ్చారు. కురవి మండల పెద్దతండాకి చెందిన జగ్గులాల్, సబితా దంపతులు 3 నెలల చిన్నారితో సహా పరీక్ష రాయడానికి వచ్చారు. చిన్నారి వాళ్ళ నాన్నమ్మ దగ్గర బాగా ఏడుస్తుండటంతో మహిళ కానిస్టేబుల్ శ్రీలత చిన్నారిని దగ్గర తీసుకొని లాలించారు.