ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హావా నడుస్తోంది. చూస్తుండగానే ఈ కృతిమ మేధస్సు మన జీవితంలోకి వచ్చేసింది. ఏఐ చాట్‌బాట్‌తో పిల్లల హోంవర్క్ తో పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోడింగ్ వరకూ ప్రతీది వేళ్ల మీది పనిలా మారి పోయింది. స్టార్టప్‌ల నుంచి పెద్ద పెద్ద ఐటీ కంపెనీల వరకు ప్రతి ఒక్కరూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. కాగా, భవిష్యత్త్ సాంకేతిక సాధనంగా మారిపోయిన ఈ ఏఐ టెక్నాలజీ సాయంతో సైబర్ నేరగాళ్లు దొంగతనాలు చేస్తున్నారు. అందుకు ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. తాజాగా ఏఐతో ముఖం మార్చుకున్న ఓ సైబర్ నేరగాడు.. ఓ వ్యక్తి దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేశాడు. అయితే తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read Also: High BP: హైబీపీ ఉంటే కిడ్నీకి ఎఫెక్ట్.. ముఖ్యంగా వారికి ప్రమాదం..!
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌కు చెందిన రాధాకృష్ణన్ కు గత ఆదివారం గుర్తుతెలియని నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో ఇమేజ్ ఆధారంగా అతడు ఆంధ్రప్రదేశ్ లో తన మాజీ కొలీగ్‌లా కనిపించడంతో పాటు తమ కామన్ స్నేహితుల పేర్లను కూడా చెప్పడంతో స్కామర్‌ను బాధితుడు నమ్మి అతడితో వీడియో కాల్ మాట్లాడాడు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత తమ బంధువు హాస్పిటల్ లో ఉన్నాడని నమ్మించి సైబర్ కేటుగాడు.. రూ. 40,000 ఇవ్వాలని కోరాడు.. తన ఫ్రెండ్ కు హెల్ప్ చేయాలని భావించిన రాధాకృష్ణన్ ఆ డబ్బు మొత్తం ఆన్ లైన్ లో పంపాడు. దీంతో తాను మోసపోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Read Also: Errabelli Dayakar Rao: బిఆర్ఎస్ ఇచ్చే మూడు పంటలు కావాలా.. కాంగ్రెస్ ఇచ్చే మూడు గంటల కరెంట్ కావాలా?