తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున.. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగాన్ని డీజీపీ అంజనీ కుమార్ అప్రమత్తం చేశారు. రానున్న 48 గంటలలో రాష్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలపై పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్ కూడా పాల్గొన్నారు. డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటారని.. సహాయం కోసం డయల్100కి లేదా స్థానిక పోలీసులకు గానీ సమాచారం అందిన వెంటనే తగు సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Aakanksha Singh: మైండ్ బ్లాకయ్యే ఫోజులతో రచ్చ చేస్తున్న నాగ్ హీరోయిన్.. ఇలా అయితే తట్టుకోవడం కష్టమే!
గురువారం 8 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ ప్రకటించారని.. అలాగే రేపు కొన్ని ఈశాన్య, తూర్పు తెలంగాణతో పాటు పశ్చిమ తెలంగాణలోని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ఉందని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్‌లో ఈ రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయని.. ఈ జలాశయాల వద్దకు ఎవరు వెళ్లకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.
Pekamedalu Teaser: వీడు లక్ష్మణ్ కాదు లత్కోర్.. ఆకట్టుకుంటున్న పేకమేడలు టీజర్
వరద ఉదృతితో తెగిపోయిన రోడ్లు, ఉదృతంగా ప్రవహించే కాజ్ వే ల వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలని డీజీపీ ఆదేశించారు. రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, బారిగేడ్స్, హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలోని లోతట్టు ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉపయోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని.. వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గానీ, వైర్లను గానీ చేతులతో తాకకుండా, ఇతర జాగ్రత చర్యలపై సమాచార మాధ్యమాల ద్వారా ప్రజలను చైతన్య పర్చాలని ఆదేశించారు. వర్షాలకు కల్వర్టు, చిన్న చిన్న బ్రిడ్జిల వద్ద నీరు ప్రవహిస్తున్నప్పుడు వాహనాలతో దాటడానికి సాహసం చేయరాదు అని సూచించారు. జలపాతాలు, నిండిన చెరువుల మత్తళ్ల వద్దకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు.