హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. రహదారులపై కూడా వరద నీరు భారీగా చేరుకుంటుంది. దీంతో రోడ్లపై వాహనదారులు ట్రాఫిక్ జామ్ తో అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా నగరంలో ఐటీ కంపెనీలు ఉండే ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్ వంటి ఏరియాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అవుతుంది. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్ వేర్ కంపెనీలకు ‘లాగౌట్’ పేరుతో కీలక సూచనలు చేశారు. ఈ విధానాన్ని ఆగష్టు 1 వరకు పొడిగించినట్లు సైబరాబాద్ పోలీసులు బుధవారం తెలిపారు.
Missing Cases: తెలుగు రాష్ట్రాల్లో మిస్సింగ్ వివరాలు వెల్లడించిన కేంద్రం
వర్షాల కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవడానికి సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. ఫేజ్ – 1లో ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ – 2 ఐకియా నుండి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలి. ఫేజ్ – 3 ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.