హైదరాబాద్ లోని చైతన్యపురిలో పోపిస్ట్రా అనే మత్తుమందును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా మత్తుమందును విక్రయిస్తున్న రాజస్థాన్ కు చెందిన రమేష్ అనే వ్యక్తిని ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుండి 5 కిలోల పైచిలుకు పోపిస్ట్రాను పోలీసులు సీజ్ చేశారు. పోపీస్ట్రాతో పలురకాల మత్తు పదార్ధాలను రమేష్ తయారు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. పోపిస్ట్రాను రమేష్ ఇప్పటివరకు ఎవరెవరికి విక్రయించాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Chada Venkata Reddy: ఈనెల 26 నుండి ‘సేవ్ ఆర్టీసీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
మరోవైపు గతంలో కూడా.. హైదరాబాద్ లో పోపిస్ట్రా మత్తుమందు అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ రాచకొండ పోలీసులు దాడులు నిర్వహించి పోపిస్ట్రాను సీజ్ చేశారు. పంజాబ్ నుండి హైద్రాబాద్ కు పోపిస్ట్రాను తరలిస్తున్న ఇద్దరి నిందితులను పోలీసులు 2022 ఏప్రిల్ 2వ తేదీన అరెస్ట్ చేయగా.. వారి నుండి 900 గ్రాముల పోపిస్ట్రాను స్వాధీనం చేసుకున్నారు. కీసర- షామీర్ పేట రోడ్డులో పోలీసులు సోదాలు జరుపగా.. ఆ సమయంలో పోపిస్ట్రాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ ఘటన వెలుగుచూసింది.