Crime: ఏంటి గుడి దగ్గర మూత్ర విసర్జన చేయొద్దని చెప్పినందుకు చంపేస్తారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని తిరువనంతపురం జిల్లా కట్టకడలో 15 ఏళ్ల ఆదిశేఖర్ అనే బాలుడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. అయితే ఆగస్టు 30వ తారీఖున ఆ బాలుడు తన స్నేహితులతో ఆడుకొని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో పూవాచల్‌లోని లింకోడ్ ఆలయం సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ఎలక్ట్రిక్ కారు అతడిని ఒక్క సారిగా ఢీకొట్టింది. ఈ విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీంతో పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసుకున్నారు. అయితే విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు తీసుకుని అనంతరం నిందితుడిపై హత్యానేరం కేసు నమోదు చేశారు.
Read Also: Maharashtra: భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త ఆత్మహత్య.. కోర్టు ఏం తీర్పునిచ్చిందంటే?
Also Read
వివరాల్లోకి వెళితే.. ఆదిశేఖర్ కు దూరపు బంధువైన 41 ఏళ్ల ప్రియరంజన్ విదేశాలలో జాబ్ చేస్తున్నాడు. ఇటీవల సొంత గ్రామానికి వచ్చారు. గత నెలలో ఒక రోజు మద్యం మత్తులో స్థానిక దేవాలయం ముందు ప్రియరంజన్ మూత్ర విసర్జన చేశాడు. దీంతో ఆదిశేఖర్ గమనించి.. ఇదేం పని అని అతడిని నిలదీశాడు. అక్కడ మూత్ర విసర్జన చేయకూడదని హెచ్చరించాడు. ఇక, ప్రియరంజన్ కు కోపం వచ్చింది.. దీనిపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాడు. మంచి సమయం కోసం ఎదురుచూశాడు.
Read Also: Kaloji Son: కాళోజీ నారాయణరావు తనయుడు రవికుమార్ మృతి
అయితే, ఆదిశేఖర్ ఆగస్టు 30వ తేదీన సైకిల్ పై వెళ్తూ కనిపించాడు. ఇదే కరెస్ట్ టైం అనుకున్న ప్రియరంజన్.. ఆ బాలుడిని కారుతో ఢీకొట్టాడు. అనంతరం కారును బాలుడిపైకి ఎక్కించాడు. ఈ తతంగం మొత్తం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఈ ఘటనను హత్యగా నిర్ధారించారు. అనంతరం నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ప్రియరంజన్ ను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కట్టకాడ పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!