Uttar Pradesh: కారులో వచ్చి మేకను ఎత్తుకెళ్లిన దొంగలు.. కాస్ట్లీ దొంగతనం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వచ్చి మేకల దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే దొంగలు కారు ఎవరికి కననపడకుండా ఉండటానికి.. చీకటిలో కొంత దూరంలో నిలిపారు. అనంతరం మేకను కారులో ఎక్కించుకుని పరారయ్యారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డయింది. కారులో వచ్చి మేకలను దొంగిలించిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: Sound Party: సౌండ్ పార్టీ గట్టిగానే సౌండ్ చేస్తోందే!
Also Read
వివరాల్లోకి వెళ్తే.. ఈ వ్యవహారం జైస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌదరానా ప్రాంతంలో జరిగింది. మహ్ఫూజ్ అహ్మద్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఓ మేకను కట్టేశాడు. అయితే రాత్రి 2 గంటల సమయంలో కారులో వచ్చి మేకను ఎత్తుకెళ్లినట్లు మహ్ఫూజ్ చెప్పాడు. ఉదయం ఇంటి బయట కట్టేసి ఉంచిన మేక కనపడకపోవడంతో చుట్టూ పక్కలు వెతికాడు. అయినా కనిపించకపోవడంతో.. తన ఇంటి దగ్గర సీసీ కెమెరాలో చూశాడు. అప్పుడు ఈ ఘటన బయటపడింది.
Read Also: Weight Loss : బొప్పాయిని ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారా?
ఇదిలా ఉంటే.. అంతకు ముందు రామ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో వెళుతున్న దొంగలు ఉప్పు బస్తాను దొంగిలించారు. రాత్రిపూట ఎవరూ లేరని ఐదు ఉప్పు బస్తాలతో పరారయ్యారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా వైరల్‌గా మారింది. ఈ చోరీ ఘటనపై పోలీసులపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఉప్పు దొంగలను పోలీసులు పట్టుకోలేకపోయారు. మరోవైపు మేకను ఎత్తుకెళ్లిన ఘటనపై అమేథీ ఎస్పీ డాక్టర్ ఇలమార్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ కార్ డ్రైవర్ మేకను దొంగిలిస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారని తెలిపారు. ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని.. ఫిర్యాదు అందిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
- Tags
- car
- Goat
- police
- telugu news
- Theft
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!