అంబులెన్స్ లో పశువులను తరలించిన కేసులో ఐదుగురు నిందితుల్ని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్టు పోలీసులు తెలిపారు. వీరినుంచి 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు. రెంజల్ మండలం శాటాపూర్ సంతలో పశువులు కొనుగోలు చేశారు. హైద్రాబాద్ లో అంబులెన్స్ ను తయారు చేయించారు. వేడి వల్ల రాపిడికి అంబులెన్స్ లో మంటలు…
ఏపీలో మహిళలపట్ల దారుణాలు ఆగడం లేదు. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళల్ని, బాలికల్ని టార్గెట్ చేస్తున్నారు కొందరు మృగాళ్ళు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి అత్యాచార ఘటన మరువక ముందే మరో బాలికపై అత్యాచార ప్రయత్నం జరిగింది. నూజివీడుకు చెందిన మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఇంటికి తీసుకుని వెళ్తా అని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళాడు ఆటో డ్రైవర్. 5వేలు డిమాండ్ చేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వు లేదంటే నైట్ మొత్తం నాతో గడువు అంటూ…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి, డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఎక్కడ తనిఖీలు చేసినా గంజాయి గుప్పుమంటోంది. తాజాగా ఓ ప్రమాదంలో గంజాయి బయటపడడంతో అంతా అవాక్కయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గోదావరి బ్రిడ్జి సమీపంలో ఒక ప్రమాదం జరిగింది. అదుపు తప్పి పల్టీ కొట్టింది ఓ కారు. అయితే పల్టీ కొట్టిన కారులోంచి బయటపడ్డ వస్తువులు చూసి అక్కడున్నవారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆకారులో ఏం దొరికిందో తెలుసా.. భారీ మొత్తంలో గంజాయి. కారులో…
మాయమాటలు చెప్పడం. ప్రేమకబుర్లతో ఏమార్చడం, అమ్మాయిల్ని మోసం చేయడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. ఉప్పర్ పల్లి వాంబే కాలనీ లో ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు షాబాజ్ అనే యువకుడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. ప్రియుడి మాటలు నమ్మి అతనితో చనువుగా తిరిగింది ఆ బాలిక. ఆ బాలికతో తనను పెండ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చాడా యువకుడు. పెండ్లికి నిరాకరించడంతో తనపై పగ పెంచుకున్నాడు యువకుడు. ఇద్దరూ కలిసి…
అనకాపల్లి జిల్లాలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై మరో కేసు నమోదైంది. పోలీసులను దుర్భాషలాడటం, దురుసుగా ప్రవర్తించడంపై అధికారులు విచారించి సెక్షన్ 353తో పాటు మరికొన్ని సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే… రెండు రోజుల క్రితం నర్సీపట్నం గ్రామదేవత ఉత్సవాల్లో కొందరు యువకుల దూకుడు కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత జరపడానికి వీల్లేదంటూ…
ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ తరహా ఘటనలు అడుగడుగునా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఓ బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బాలికపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో కిమ్మనకుండా ఉండిపోయింది. https://ntvtelugu.com/breaking-news-young-lady-suicide-at-esi-metro-station/ ఏడుస్తూ వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆరాతీశారు. కబాబ్ తిన్నానని, అందులో కారంగా వుండడంతో ఏడిచానని…
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్ల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 న ఈ ఘటన జరగగా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోనమ్ ఇంట్లో పనిచేసేవారి ద్వారా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఒక ఖరీదైన ప్లాట్ లో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, అతని తల్లితండ్రులుతో…
సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎక్కవ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధీమా తో పలువురు హీరోయిన్లను వేధిస్తున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు వారికి ఘాటుగా రిప్లైలు ఇచ్చి బుద్దిచెప్తున్నారు. మరికొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఒక టీవీ నటి ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వివరాల్లోకి…
కట్టుకున్న భర్తను భార్యతో పాటు ఆమె తల్లిదండ్రులు కలిసి అతి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండలం బీడీ కాలనీ లో ఈ దారుణం చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తి 36 సంవత్సరాల కాసాల బ్రహ్మయ్య చారిగా గుర్తించారు. కాసాల బ్రహ్మయ్య చారిని హత్యచేసింది భార్య నందిని, మామ దత్తాత్రేయ, అత్త గంగామణిలుగా పోలీసులు గుర్తించారు. రూరల్ సీఐ శ్రీనివాస్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు అందచేశారు. బీబీపేట మండల కేంద్రానికి చెందిన…
తెలంగాణలోని ములుగు జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని విక్రయిస్తున్న ముఠాను వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి నకిలీ పులి చర్మాన్ని 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని అమ్మే ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. టైగర్ స్కిన్ కి ఉన్న డిమాండ్ తో మేక తోలును పులి తోలుగా రంగులు వేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్…