తెలంగాణలోని ములుగు జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని విక్రయిస్తున్న ముఠాను వరంగల్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి నకిలీ పులి చర్మాన్ని 16 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నకిలీ పులి చర్మాన్ని అమ్మే ముఠా వరంగల్ పోలీసులకు చిక్కింది. టైగర్ స్కిన్ కి ఉన్న డిమాండ్ తో మేక తోలును పులి తోలుగా రంగులు వేసి అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్న ముఠాను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
పీఎస్ ఆత్మకూర్ పరిధిలోని ఎండీ గౌసేపల్లి వద్ద టైగర్ స్కిన్ విక్రయం జరుగుతుందని టాస్క్ ఫోర్స్ నిఘా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ లోకల్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి పులి చర్మం అమ్ముతున్న బృందం సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రణవత్ ఉండవర్ ఎస్/వో దేవ్‌పూర్ ఆర్/ఓ బండ్లగూడ రంగారెడ్డి , బిల్లా రాజేష్ S/o బిల్లా రాజమల్లు, R/o రామచంద్రపురం ములుగు జిల్లా..వారినుంచి టైగర్ చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిని విచారించగా అది నకిలీ పులి చర్మం అని తేలింది.అంతేకాదు మేక చర్మానికి ఒరిజినల్ టైగర్ స్కిన్ లాగా ఉండేలా రంగులు వేసి నకిలీ టైగర్ స్కిన్‌ను అసలు పులి చర్మం అని కస్టమర్‌కు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు వెల్లడించాడు. 16 లక్షల నగదు, నిందితులను ఆత్మకూర్ పీఎస్‌కు అప్పగించారు. పులి చర్మానికి ఉన్న డిమాండ్ ను క్యాష్ చేసుకునెందుకు కొందరు కేటుగాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.