బాలీవుడ్ హీరోయిన్ రిమి సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధూమ్ 2, గోల్‌మాల్, బాగ్‌బాన్, హంగామా వంటి సినిమాల్లో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ కి కూడా సుపరిచితమే. మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన అందరివాడు చిత్రంలో రిమి సేన్ నటించి తెలుగు ప్రేక్షకులను సైతం మెప్పించింది. ఇక ఈ అమ్మడు ప్రస్తుతం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంది. తాను స్నేహితుడని నమ్మిన ఒక వ్యక్తి తనను అడ్డంగా మోసం చేసాడని, కొత్త వ్యాపారం…
కట్టుకున్నవాడే కాలయముడయ్యాడు. కళ్ళలో పెట్టుకుని కాపురం చేయాల్సిన మొగుడు ఆమెని అతి కిరాతకంగా హతమార్చాడు. భార్యను బతికుండగానే అడవిలో పూడ్చిపెట్టాడో కర్కోటక భర్త ఉదంతమిది. తమిళనాడులో కలకలం రేపిన శాడిస్టు భర్త తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది, బతికున్న భార్యను పూడ్చి పెట్టిన భర్త తాపీగా తన పనులు తానుచేసుకోవడం ప్రారంభించాడు. వేలూరు జిల్లా కాట్పాడీలో ఈ ఘటన జరిగింది. నాలుగేళ్ళ క్రితం సుప్రజ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకున్నాడు వినాయకం. అనుమానంతో పాటు అనారోగ్యంతో…
ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అమెరికాలోని ఒక బార్ లో తప్ప తాగి ఒక లేడి సింగర్ పై లైంగిక దాడికి పాల్పడిన అతడిపై కేసు నమోదు చేసి హవాయి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎజ్రా మిల్లర్ ఇటీవల హవాయిలోని ‘హిలోలో బార్’లో పార్టీని ఎంజాయ్ చేస్తున్నాడు. అక్కడ ఒక యువతి…
నిర్మాత బన్నీ వాస్‌పై సునీత బోయ అనే మహిళ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బన్నీ వాస్ అధికారిక ప్రతినిధి మీడియాకు వివరణ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి సునీత బోయ, గీతా ఆర్ట్స్ సంస్థ, అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి ఆరోపణలు ఎంతో కాలంగా చేస్తోందని తెలిపారు. దీనికి ఆధారాలు కావాలంటే 2019…
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్స్ 2022 ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వేడుకలో ఒక అపశృతి చోటుచేసుకోవడం, అది కాస్తా ప్రస్తుతం హాట్ తొలిపిక్ గా మారడం జరిగిపోయింది. హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భార్యపై యాంకర్ క్రిస్ జోకులు వేయడం.. దానికి హార్ట్ అయిన విల్ స్మిత్ వేదికపై అతగాడి చెంప చెళ్లుమనిపించడం.. ఈ హఠాత్ పరిణామానికి అక్కడున్న వారందరు షాక్ కి గురి అవ్వడం చకచకా…
కోలీవుడ్ హీరోయిన్ మీరా మిథున్ మరోసారి వార్తల్లో నిలిచింది. అమ్మడికి వివాదాలేమి కొత్తకాదు.. సోషల్ మీడియాలో ఏది అనిపిస్తే అది మాట్లాడి వివాదాలను కొనితెచ్చుకొనే ఈ భామపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. తమిళ్ లో కొన్ని సినిమాల్లో నటించిన మీరా.. తనకు అవకాశాలు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని, అందులో షెడ్యూల్ కులస్థులు కూడా ఉన్నారని, వారిని వెంటనే సినీ ఇండస్ట్రీ నుంచి తప్పించాలంటూ వారిని, వారి కులాన్ని కించపరుస్తూ గతంలో వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా…
కోలీవుడ్ స్టార్ హీరో శింబు కుటుంబం చిక్కుల్లో పడింది. నిర్లక్ష్యంగా కారునడిపి ఒక వృద్ధుడి ప్రాణం తీసినందుకు శింబు కారు డ్రైవర్ సెల్వం ని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మార్చి 18 అర్ధరాత్రి శింబు తండ్రి, నటుడు టి. రాజేందర్, తన మనవరాలిని హాస్పిటల్ కి తీసుకెళ్లి తీసుకొస్తుండగా.. మార్గమధ్యంలో ఒక వృద్ధుడు పాకుతూ రోడ్డు దాటుతున్నాడు. ఇక ఈ…
ప్రజల బాధలను తీర్చడానికే పోలీస్ వ్యవస్థ ఉన్నది.. అయితే ఆ వ్యవస్థను చిన్న చిన్న కారణాలకు కొంతమంది వ్యక్తులు పోలీసులను ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఒక వ్యక్తి పోలీసులను ఇలాగే ఇబ్బందిపెట్టి జైలుపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి హోలీ రోజున ఫుల్ గస మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్యను మటన్ వండమని అడిగాడు. అందుకు ఆమె నిరాకరించిందంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. వెంటనే…
ఇవాళ హోలీ పండుగ. ఈ రంగుల పండుగ లాగే జీవితం కూడా రంగుల మయంగా వుండాలని, అంతా కలిసి జరుపుకుంటారు. అయితే అక్కడక్కడా కొందరు ఆకతాయిలు, మందుబాబులు హల్ చల్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హోలీ పండుగ సందర్భంగా ఇంట్లో మద్యం సేవించి రోడ్డుపైకి నానా గొడవ చేశారు. తమ చేతిలోని మద్యం సీసాలను జనంపైన విసిరేశారు, రోడ్డు వెంట వెళ్ళే వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి…
టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ మరియు అతని కుమారుడు సినీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పై ఫైనాన్షియర్ శ్రవణ్ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. గోపించంద్ మలినేనితో శ్రీనివాస్ సినిమా ఉంటుందని చెప్పి తనవద్ద రూ.85 లక్షలు తీసుకున్నారని అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని శ్రవణ్ గత వారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణ హాని కూడా ఉందని తెలిపాడు. ఇక ఈ కేసుఫై బెల్లంకొండ…