ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలకు, చిన్నారులకు రక్షణ లేకుండా పోతోంది. నిర్భయ తరహా ఘటనలు అడుగడుగునా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఓ బాలికపై ఎనిమిది మంది అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరులోని యెలహంక ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని తెలుస్తోంది. బాలికపై కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించడంతో కిమ్మనకుండా ఉండిపోయింది.
Breaking News : ప్రేమ విఫలమైందని మెట్రో స్టేషన్ నుంచి దూకిన యువతి.?
ఏడుస్తూ వచ్చిన బాలికను తల్లిదండ్రులు ఆరాతీశారు. కబాబ్ తిన్నానని, అందులో కారంగా వుండడంతో ఏడిచానని బాలిక తెలిపింది. బాలిక నుంచి సమాధానం రాబట్టిన తల్లిదండ్రులు.. అసలు విషయాన్ని తెలుసుకున్నారు. యెలహంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
విషాహారం తిన్న బాలికలు..
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో బాలికలు ఆత్మహత్యకు ప్రయత్నించారు, ముగ్గురు మరణించారు. ఆత్మహత్యకు పాల్పడాలని భావించి ఆరుగురు బాలికలు ఒకేసారి విషం తెచ్చుకుని తాగేశారు. వెంటనే ముగ్గురు ప్రాణాలు విడిచారు. మిగిలిన ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాస్మా ప్రాంతంలో ఈ ఆరుగురు బాలికలు నివాసం ఉంటున్నట్టు తెలిసింది. వీరందరూ మంచి స్నేహితులు. అందులో ఓ బాలిక వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని సమాచారం. యువకుడు పెళ్లికి నిరాకరించడం వల్ల మనస్తాపానికి గురైన బాలిక.. విషం తాగింది. దీంతో మిగిలిన ఐదుగురు స్నేహితులు సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మిగిలిన వారు మగధ్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి కూడా విషమంగా వుందంటున్నారు.