Cows Burnt Case: పశువుల తరలింపు కేసు.. ఐదుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబులెన్స్ లో పశువులను తరలించిన కేసులో ఐదుగురు నిందితుల్ని నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో మరో ముగ్గురు వ్యక్తులు వున్నట్టు పోలీసులు తెలిపారు. వీరినుంచి 5 సెల్ ఫోన్లు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశ పెట్టారు పోలీసులు. ఏసీపీ వెంకటేశ్వర్లు వివరాలు తెలిపారు.
రెంజల్ మండలం శాటాపూర్ సంతలో పశువులు కొనుగోలు చేశారు. హైద్రాబాద్ లో అంబులెన్స్ ను తయారు చేయించారు. వేడి వల్ల రాపిడికి అంబులెన్స్ లో మంటలు వ్యాపించాయి. దీంతో 13 పశువులు సజీవ దహనమయ్యాయి. పశువులను బంధించి తీసుకెళ్లడం నేరం. ఈ ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే….
Also Read
గత కొంతకాలంగా పశువులను కొని వాటిని కబేళాలకు తరలిస్తుంటారు. ఇదంతా అక్రమంగా సాగుతుంటుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి తన వాహనాన్ని అంబులెన్సుగా మార్చారు. అందులో మూగజీవాలను అక్రమంగా తరలిస్తుండేవారు. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం మాక్లూర్ తండా వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి అంబులెన్సు దగ్ధమైన ఘటనలో 13 ఎద్దులు సజీవ దహనం అయ్యాయి. కాలిపోయిన కోడెద్దులను అటవీ ప్రాంతంలో ఖననం చేశామన్నారు. రెంజల్ మండలం సాటాపూర్ పశువుల సంతలో వాటిని కొనుగోలు చేశారని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో తనిఖీలు కట్టుదిట్టం చేయడంతో ఎద్దుల తరలింపునకు అక్రమ మార్గాలు అనుసరించారు. ద్దుల అకాల మరణానికి కారణమైన ఎనిమిది మందిపై ఇందల్‌వాయి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు సీపీ చెప్పారు. ఈ ఘటనను ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. చెక్‌పోస్టుల వద్ద భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Yesterday night, 10 cows were transported to Slaughterhouse in 'Ambulance' from Nizamabad to Hyderabad, 8 cows were burnt alive in the ambulance and the driver is on the run.@TelanganaDGP should immediately act against the people behind this. pic.twitter.com/O8BYNlmVxn
— Raja Singh (@TigerRajaSingh) May 1, 2022
తాజావార్తలు
-
Jr. Doctors Protest : నెలకు రూ.5 వేలేనా? వైద్యుల ఆందోళన.. సిరిసిల్లలో ఓపీ బంద్.!
-
AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
-
Bloody Romeo: నాని ‘బ్లడీ రోమియో’.. షూటింగ్ డేట్ ఫిక్స్!
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!