సోషల్ మీడియా వచ్చాకా హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎక్కవ అయ్యాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధీమా తో పలువురు హీరోయిన్లను వేధిస్తున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు వారికి ఘాటుగా రిప్లైలు ఇచ్చి బుద్దిచెప్తున్నారు. మరికొంతమంది ఆ వేధింపులు తట్టుకోలేక సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా ఒక టీవీ నటి ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అవడంతో ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్ బుల్లితెర నటి విభూతి ఠాకూర్ పర్సనల్ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆ తర్వాత ఆ నెంబర్ కి అనేక మంది ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని, వస్తావా అంటూ నీచంగా అడుగుతున్నారని విభూతి ఠాకూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంకా ఆమె ఏం చెప్పిందంటే
” నేను మొదట ఎవరో నాతో ప్రాంక్ చేస్తున్నారని అనుకుని లైట్ తీసుకున్నాను. ఆ ఆ తరువాత వరుసగా ఫోన్లు, మెసేజ్ లు. వాటిని చూసి నేను మానసికంగా కుంగిపోయాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే ఇదంతా ఎవరో కావాలని, నన్ను బెదిరించాడు చేస్తున్నారు. ఇది వారికి సిగ్గుచేటు.. ఇలా ఒక అమ్మాయిని బెదిరించడం పద్దతి కాదు వారి చేసిన పని వల్ల అవమానకరమైన మెస్సేజులు, కాల్స్‌లో ఇబ్బంది పడ్డాను. అందుకే పోలీసుల వద్దకు వచ్చాను. ఆ ఫోన్ నంబర్స్, మెసెజ్ ల స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్నాయి” అని చెప్పుకొచ్చింది. నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని చర్యలు చేపట్టారు.