మాయమాటలు చెప్పడం. ప్రేమకబుర్లతో ఏమార్చడం, అమ్మాయిల్ని మోసం చేయడం ఈరోజుల్లో కామన్ అయిపోయింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దారుణం జరిగింది. ఉప్పర్ పల్లి వాంబే కాలనీ లో ఓ బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించాడు షాబాజ్ అనే యువకుడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. ప్రియుడి మాటలు నమ్మి అతనితో చనువుగా తిరిగింది ఆ బాలిక.
ఆ బాలికతో తనను పెండ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చాడా యువకుడు. పెండ్లికి నిరాకరించడంతో తనపై పగ పెంచుకున్నాడు యువకుడు. ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అలా పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. విడతల వారిగా ఇప్పటి వరకు 80 వేల రూపాయలు కాజేశాడు ఆ కంత్రీగాడు. ఇంకా డబ్బులు కావాలని వత్తిడి చేయసాగాడు. యువకుడి వేధింపులు భరించలేక తల్లిదండ్రుల సహాయంతో రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించిందా బాలిక.
బాలిక ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్టు చేశారు పోలీసులు. అతని పై SC, ST యాక్ట్, పోక్సో తో పాటు 354 IPC కింద కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఇలాంటి సంఘటనలు, మోసాలు ఎన్ని జరుగుతున్నా సోషల్ మీడియా ప్రభావంతో యువత మాయగాళ్ళ వలకు చిక్కుతోంది.
Read Also: Venkaiah Naidu: ఉపరాష్ట్రపతికి తప్పని నకిలీల బెడద.. వెంకయ్య పేరుతో ఫేక్ మెసేజ్‌లు..