Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం సమీపంలోని ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మద్యం సేవిస్తున్న మందు బాబులు విద్యార్థులతో ఘర్షణకు దిగిన ఘటన కలకలం రేపుతోంది. వసతి గృహ సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్టు గమనించిన విద్యార్థులు, ఇక్కడ మద్యం సేవించడం మంచిది కాదని వారిని హెచ్చరించారు. విద్యార్థులు చేసిన పనిని సీరియస్ గా తీసుకున్న మందు బాబులు మద్యం మత్తులో వసతి గృహంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత…
Perni Nani : ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి…
Murder : తల్లి లేకపోవడం తండ్రి హత్యకు గురవడంతో మైనర్లు అయిన వారి కుమార్తెలు అనాథలయ్యారు. ఏలూరుకు చెందిన వెంకటకనకరాజుకు ముగ్గురు ఆడపిల్లలు ఆయన భార్య ఎనిమిదేళ్ల కిందట మరణించింది. అప్పటినుంచి పిల్లల బాధ్యతను ఆయనే చూస్తున్నారు. ఏలూరులోని రామకృష్ణాపురం రైల్వే బ్రిడ్జి కింద కన కరాజు హత్యకు గురయ్యారు. పెద్ద కుమార్తెను తనకు ఇచ్చి పెళ్లి చేయడం లేదని కక్ష గట్టిన నాని అనే యువకుడు ఆయనను కత్తితో పొడిచాడు. కనక రాజు మృతదేహానికి సర్వజన…
Ganja Seized : మెదక్ జిల్లా మొగుడంపల్లి మండలం మాడిగిలోని ఆర్‌టీఏ చెక్‌పోస్ట్ వద్ద 800 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి భారీ ఎత్తున గంజాయి తరలిస్తుండగా, పూణె , గోవా రాష్ట్రాల డిఆర్‌ఐ స్పెషల్ ఫోర్స్ అధికారులు లారీని వెంబడించి పట్టుకున్నారు. తమను పోలీసులు వెంబడిస్తున్నట్లు గమనించిన లారీ డ్రైవర్ చాకచక్యంగా చెక్‌పోస్ట్ వద్ద లారీ ఆపి, కాగితాలు చూపించిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. లారీ వద్ద ఉన్న డిఆర్‌ఐ అధికారులు…
ఉపమఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేషీకి ఓ నెంబర్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో హోంమంత్రి అనితకు ఇదే నెంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. మల్లిఖార్జున రావు పేరుతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఈ కాల్స్ రాగా.. పోలీసులు ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనించాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై, తన కుటుంబ సభ్యులపై చేస్తున్న ట్రోలింగ్స్‌పై తాను వెళ్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానన్నారు. వైఎస్ జగన్‌పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తింటున్నాయన్నారు.
Nara Lokesh : శ్రీకాకుళం జిల్లాలోని ఓ కోచింగ్ సెంటర్ యాజమాన్యం ట్రైనింగ్ అభ్యర్థులను దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆర్మీ ఉద్యోగాల కోసం వ్యక్తులను సిద్ధం చేయాలని కోచింగ్ సెంటర్ ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్న మంత్రి నారా లోకేష్.. బాధ్యులపై శ్రీకాకుళం పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో “ఇండియన్ ఆర్మీ కాలింగ్” అనే సంస్థను నడుపుతున్న వెంకట రమణ…
మనుషుల్లో పెరుగుతున్న పైశాచికత్వానికి పరాకాష్ఠగా నిలిచిన ఘటన జవహర్ నగర్ లో చోటుచేసుకుంది. వీధికుక్కలపై కర్రలతో దాడి చేసిన దుండగులు వాటిని చిత్ర హింసలకు గురిచేసి చంపారు.
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
ఏఓబీ ఆంధ్రా ఒరిస్సా బార్డర్ నుంచి గంజాయి, బెంగూళూరు, గోవా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న డ్రగ్స్‌ను ఎక్సైజ్, ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు ఎంతో శ్రమకు ఓర్చి పట్టుకున్నారు. 703 కేసుల్లో పట్టుబ డిన 7951 కేజీల గంజాయిని, డ్రగ్స్‌ను కాల్చేశారు. దహనం చేసిన గంజాయి, డ్రగ్స్ విలువ రూ.11,61,90,294 ఉంటుంది.