Fraud: ఉప్పల్ ప్రాంతంలో ఒక బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని చెప్పి ప్రజలను మోసగొట్టే ఘటన వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి, ఇంస్టాగ్రామ్ ద్వారా శరవేగంగా ప్రచారం చేసి, బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని వాగ్దానం చేశాడు. ఈ ప్రకటనతో బాధితులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ భాగయత్ లోని శిల్పారామం వద్ద ఆయన ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద చేరుకున్నారు. సల్మాన్ తన స్వతంత్రంగా ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద బట్టతల మీద…
పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రాజమండ్రిలోని లలితా నగర్ ప్రాంత వాసి దేవబత్తుల నాగమల్లేష్ ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. స్థానిక వీఆర్ఓ ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న మల్లేష్ ని అరెస్ట్ చేసినట్లు రాజమండ్రి మూడవ పట్టణ పోలీసులు తెలిపారు. కోర్టులో ప్రవేశ పెట్టిన మల్లేష్ కు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు తరలించారు.
జన సమితి కోదండ రామ్ రెడ్డికి కళ్లు కనిపించడం లేదా? అని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వేలంపై ఆయన మాట్లాడారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని... ఈ భూములను కాపాడుతామన్నారు. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులని గుర్తు చేశారు. ఈ భూములను రాబర్ట్ వాద్రా కోసమే అమ్ముతున్నావా? అని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీ భర్త కోసమే భూముల అమ్ముతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. కేటీఆర్ దొంగ…
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో చిన్న చిన్న అమ్మాయిలను మెడలు పట్టుకుని గుంజుకుపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "తెలంగాణ సమాజం బాధ పడుతుంది. సీఎం కి కనీస మానవత్వం లేదు.. మా భూములను అమ్మకండి అని విద్యార్థులు అడిగితే అమానుషంగా వ్యవహరించారు. ఈ నెల గడవాలి అంటే హెచ్‌సీయూ భూములు అమ్మాలి.
రేపు జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ టిక్కట్లను విచ్చలవిడిగా బ్లాక్‌లో అమ్ముతున్నారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర మ్యాచ్ టిక్కెట్లను బ్లాక్‌లో అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం.. అతని వద్ద నుంచి టికెట్స్ స్వాధీనం చేసుకున్నారు.
Ganja Smuggling: భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద గంజాయి స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు. తాజాగా గంజాయిని తరలిస్తూ, తనిఖీల్లో ఉన్న కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ యోగేంద్ర చారి తీవ్రంగా గాయపడ్డారు. అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ తెల్లవారుజామున భద్రాచలం బ్రిడ్జి చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ యోగేంద్ర చారిపై గంజాయి స్మగ్లర్లు బైక్‌తో దాడి చేశారు.…
హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. ఓ టూ వీలర్‌ను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ పై వెళ్తున్న ఒకరు మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Harish Rao : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపుతోంది SLBC టన్నెల్ ప్రమాద ఘటన. గత నాలుగు రోజులుగా సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు తీవ్రంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి తదితరులు సహాయక…
HYDRA: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను గుర్తించి, తొలగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రా (HYDRA) మరోసారి తన దూకుడును ప్రదర్శించింది. హైడ్రా ప్రధానంగా చెరువులు, నదులు, ప్రభుత్వ భూములు, ఫుట్‌పాత్‌లు, రహదారులపై ఏర్పడ్డ అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంలో కీలక పాత్ర పోషిస్తోంది. నగరంలో ప్రణాళికా ప్రకారంగా అభివృద్ధి జరగాలని, అక్రమ ఆక్రమణలతో చెరువులు, బఫర్ జోన్ ప్రాంతాలు నాశనం కాకుండా ఉండాలని ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. గత కొంత కాలంగా హైడ్రా ఆక్రమణదారులపై ఉక్కుపాదం…
Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు మరోమారు పెద్ద షాక్ తగిలింది. తాజాగా రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులను జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం, హాస్పిటల్‌కు వెళ్ళడం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల,…