హైదరాబాద్ ని డ్రగ్స్ మత్తు చుట్టేస్తోంది. సెలబ్రిటీలు, సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, వీఐపీల సంతానం.. డ్రగ్స్ బారిన పడుతున్నారు. హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ లో యువత ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న సంపన్నులు ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తెప్పించుకొని వారికి తెలిసిన వాళ్ళ కు అలవాటు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పిల్లలు కూడా డ్రగ్స్…
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి చెందిన మురళి అనే టీడీపీ కార్యకర్త ను కిడ్నాప్ చేసి తీవ్రంగా చితకబాది వదిలేశారు వైసీపీ నేత, రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ అనుచరులు.ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ కి అని చెప్పి మురళి ని తీసుకెళ్ళారు సెంథిల్ కుమార్ అనుచరులు. ప్రస్తుతం కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు బాధితుడు మురళి. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ములకల పల్లె గ్రామానికి చెందిన మురళి.…
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి మత్తు వేధిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒకచోట గంజాయి పట్టుబడుతూనే వుంది. విశాఖ మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో గంజాయి సాగు, రవాణా అరికట్టే పనిలో నిమగ్నం అయ్యారు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో అధికారులు. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో కమిషనర్ వినీత్ బ్రిజ్ లాల్ విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించే పనిలో బిజీ అయ్యారు. ఇందుకోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ప్రభుత్వ శాఖల సమన్వయంతో…