Adilabad: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం సమీపంలోని ప్రభుత్వ పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మద్యం సేవిస్తున్న మందు బాబులు విద్యార్థులతో ఘర్షణకు దిగిన ఘటన కలకలం రేపుతోంది. వసతి గృహ సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్టు గమనించిన విద్యార్థులు, ఇక్కడ మద్యం సేవించడం మంచిది కాదని వారిని హెచ్చరించారు. విద్యార్థులు చేసిన పనిని సీరియస్ గా తీసుకున్న మందు బాబులు మద్యం మత్తులో వసతి గృహంలోకి చొరబడి దాడికి తెగబడ్డారు. ఆ తర్వాత విచక్షణ రహితంగా ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు చేసుకున్న ఈ ఘటన రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు దీనిపై స్పందించకముందే ఈ దాడుల వీడియో సోషియల్ మీడియాలో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
Also Read: Jasprit Bumrah Record: చరిత్ర సృష్టించిన బుమ్రా.. తొలి బౌలర్‌గా అరుదైన రికార్డు!
వసతి గృహంలో జరిగిన ఈ ఘర్షణకు సంబంధించి తమ వద్ద ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు విద్యార్థుల భద్రతకు ప్రమాదకరమని, వసతి గృహ ప్రాంతంలో నిషేధిత చర్యలను అరికట్టడంలో సమాజం బాధ్యత వహించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.