ఏపీలో ఛలో కంతేరు నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ కార్యకర్త వెంకాయమ్మ కుటుంబంపై దాడి ఘటనను టీడీపీ సీరియస్ గా తీసుకుంది. దాడిపై పోలీసులుస్పందించలేదంటూ ఛలో కంతేరుకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు ఎలర్ట్ అయ్యారు. గుంటూరు జిల్లాలో టీడీపీ కీలక నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్, మాజీమంత్రి నక్కా ఆనందబాబులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈసందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు మాజీ…
ఏపీలో బీజేపీ వర్సెస్ వైసీపీ ఎపిసోడ్ నడుస్తోందా? అంటే అవుననే చెప్పాలి. ఒకవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటించారు. మాజీ మంత్రి పేర్ని నాని బీజేపీపై చేసిన విమర్శలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఫైరయ్యారు. మాది పువ్వు పార్టీనా.? అడ్డంగా బలిశారంటూ మా నడ్డాను వ్యక్తిగతంగా విమర్శిస్తారా..? మాజీ మంత్రులివి ఒళ్లు బలిసిన మాటలు. మీదే డబ్బా ఫ్యాన్ పార్టీ.. చెత్త ఫ్యాన్ పార్టీ. డబ్బా ఫ్యాన్ తమ నెత్తి మీద ఎప్పుడు…
కోనసీమ జిల్లాలో పూర్తిగా ఇంటర్నెట్ సేవలు పునరుద్దరణ జరిగాయి.దాదాపు 14 రోజుల తర్వాత పూర్తిగా బయట ప్రపంచం వారితో సంబంధాలు మొదలయ్యాయి. కోనసీమలో జరిగిన అల్లర్లతో జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో రెండు వారాలుగా జిల్లావాసులు పడ్డ కష్టాలు తొలగిపోనున్నాయి. గత నెల 24న అమలాపురంలో విధ్వంసకాండ జరిగింది. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొద్దని నిరసనకారులు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.. దాంతో అప్పటి నుంచి జిల్లావ్యాప్తంగా 16 మండలాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపి…
ఒక్క ఘటనతో ఎన్నో సమస్యలు తెరమీదకు వచ్చాయి, కోనసీమ జిల్లా వాసులకు ఇంటర్నెట్ కష్టాలు తీరడం లేదు. నెట్ కోసం గోదారి గట్టు చేరుకుంటున్నారు జనం. అమలాపురంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అయింది. కోనసీమ జిల్లాలో ఇటీవల జరిగిన అల్లర్ల కారణంగా ఇంటర్నెట్ సేవలు బంద్ కావడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నెట్ ఎక్కడ వస్తే అక్కడికి చేరుకుంటున్నారు జనం. గోదావరి గట్ల మీదకు వచ్చి నెట్ సిగ్నల్స్…
ఏపీలో జరుగుతున్న వివిధ సంఘటనలపై టీడీపీ ఆందోళన వ్యక్తం చేసింది. చిలమత్తూరు ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ హెచ్చార్సీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన బాధితుడు వేణుగోపాల్ పై ఎస్ఐ దాడి చేసిన వీడియోను ఎన్ హెచ్చార్సీకి పంపించారు వర్ల. సత్యసాయి జిల్లా, చిలమత్తూరు ఎస్.ఐ రంగడుపై చర్యలు తీసుకోవాలని వర్ల లేఖలో కోరారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు పోలీస్ స్టేషన్ లో…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది బంజారాహిల్స్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు. అక్కడ డ్రగ్స్ దొరకడంతో పోలీసులు అప్రమత్తం అయిన సంగతి తెలిసిందే. ఈకేసులో ఏం జరుగుతుందనే దానిపై ప్రజలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఈ పబ్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు తమ దూకుడు పెంచారు. మరో ముగ్గురిని నేడు విచారించనున్నారు బంజారాహిల్స్ పోలీసులు. నిన్న టోనీ కేసులో నిందితులు శశికాంత్, సంజయ్ లను దాదాపు 7 గంటల పాటు విచారించారు పోలీసులు. డ్రగ్స్…
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల పోలీస్ అధికారులు చేసిన పనికి అంతా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. సైబర్ నేరస్తుల చేతిలో మోసానికి గురైన బాధితునికి 3 లక్షల 10 వేల రూపాయలు తిరిగి ఇప్పించారు. మార్చి 26వ తేదీన మంచిర్యాల టౌన్ పరిధికి చెందిన సాగి మురళీధర్ రావు తండ్రి హన్మంతరావు రిటైర్డ్ ఇంజనీర్, గౌతమి నగర్, మంచిర్యాల అనే వ్యక్తి కి KYC అప్డేట్ కోసం సైబర్ నేరగాడు ఒక మెసేజ్ పంపగా దాన్ని నమ్మి అకౌంట్…
హైదరాబాద్ ని డ్రగ్స్ మత్తు చుట్టేస్తోంది. సెలబ్రిటీలు, సినీతారలు, పారిశ్రామిక వేత్తలు, వీఐపీల సంతానం.. డ్రగ్స్ బారిన పడుతున్నారు. హైదరాబాద్ ని డ్రగ్స్ రహిత నగరంగా మారుస్తామని, అందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు సీపీ సీవీ ఆనంద్. హైదరాబాద్ లో యువత ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారు. హైదరాబాద్ లో ఉన్న సంపన్నులు ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తెప్పించుకొని వారికి తెలిసిన వాళ్ళ కు అలవాటు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ కొన్ని ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో పిల్లలు కూడా డ్రగ్స్…