Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు మరోమారు పెద్ద షాక్ తగిలింది. తాజాగా రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్‌కు నోటీసులను జారీ చేశారు. కిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీ తేజను పరామర్శించడానికి వెళ్ళడానికి అల్లు అర్జున్ వెళ్తునందుకు ఈ నోటీసులు ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ హాస్పిటల్ దగ్గరకు రావద్దని, ఎవరూ వచ్చేందుకు అనుమతి ఇవ్వడంలేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ప్రకారం, హాస్పిటల్‌కు వెళ్ళడం అనుమతించడంలో పెద్ద సమస్య ఉండటం వల్ల, అతను వచ్చినట్లయితే ఏదైనా అక్కడ జరిగే పరిణామాలకు పూర్తిగా బాధ్యత వహించాలని పోలీసుల నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read: Godavarikhani: రోడ్డు భద్రత మాసోత్సవంలో 5K రన్ ప్రారంభం
అల్లు అర్జున్ పోలీసులు వచ్చిన సమయానికి నిద్ర లేయలేదని చెప్పడంతో, మేనేజర్ కు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. అలాగే, పోలీసులు కోర్టు పర్మిట్ లేకుండా అల్లు అర్జున్ ఎక్కడికైనా వెళ్లకూడదని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్ మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. ఈ ఘటన అల్లు అభిమానులు, మీడియా మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Also Read: SSMB 29: రాజమౌళి టార్గెట్ రూ.వెయ్యి కోట్లు కాదు.. ఏకంగా ఎన్ని వేల కోట్లంటే ?