Jayashankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పాడిరైతు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. భూపాలపల్లిలో నియోజకవర్గంలో ఒక వ్యక్తి బర్రెల షేడ్‌ను కూలగొట్టారని ఆ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఏకంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లోకి బర్రెలను తోలాడు. దీంతో క్యాంపు కార్యాలయంలో ఉన్న నేతలు, కార్యకర్తలు, ప్రజలు గందరగోళానికి గురయ్యారు. పోలీసుల వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకున్నారు. అసలు ఏం జరిగిందంటే..
పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదీ ఏ ముస్తఫా నగర్‌లోని పెళ్లిళ్లకు డెకరేషన్ చేసే గోడౌన్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక దళానికి వారికి సమాచారం చేరవేశారు.
భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర…
Youtuber : రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో యూట్యూబ్ పాపులారిటీ కోసం ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజున యూట్యూబ్ ఫేమ్ కోసం బీర్ బాటిళ్లు ఉచితంగా పంచుతూ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మతభావనలు దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యపై చర్య తీసుకున్న పోలీసులు అతనితో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. జైపూర్‌కు చెందిన లప్పు సచిన్ అలియాస్ సచిన్ సింగ్…
RCB Celebrations: ఐపీఎల్ 18వ సీజన్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచిన నేపథ్యంలో బెంగళూరులో ఘనంగా సంబరాలు నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేసారు. అయితే ఆ వేడుక కాస్త విషాదం నింపింది. జట్టు సభ్యులు విజయోత్సవం కోసం నగరానికి చేరుకున్న నేపథ్యంలో చిన్నస్వామి స్టేడియకు భారీగా అభిమానులు చేరుకున్నారు. గేట్-6 వద్ద భారీ సంఖ్యలో అభిమానులు గుమిగూడడంతో తొక్కిసలాట చోటుచేసుకొవడంతో ఇద్దరు RCB అభిమానులకు తీవ్ర గాయలయ్యాయి. ఇందులో ఆరుగురు మరణించారు. Read…
వైయస్సార్ కడప జిల్లాకు సేవచేసి అభివృద్ధి పథంలో నడిపించారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.సతీష్ కుమార్ రెడ్డి అన్నారు. అటువంటి మహనీయుడు విగ్రహాలకు టీడీపీ జెండాలు కట్టడం సమంజసమా? అని ప్రశ్నించారు. సున్నితంగా ఇది తప్పు అని పోలీసులకు అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో అక్కడి ప్రజలు ఆ జెండాలను పక్కన పెట్టారని తెలిపారు. ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందన్నారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులపై…
Bomb Threat : ఆపరేషన్ సింధూర్’ విజయంతో దేశమంతా ఉత్సాహంగా ఉన్న వేళ, రాజస్థాన్‌లోని జైపూర్‌లో మాత్రం భయానక వాతావరణం నెలకొంది. సవాయ్ మాన్‌సింగ్ (SMS) స్టేడియంలో బాంబు పెట్టినట్లు బెదిరింపు మెయిల్ రావడంతో నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. రాజస్థాన్ రాష్ట్ర క్రీడా మండలికి ఈ బెదిరింపు సందేశం మెయిల్ ద్వారా ఉదయం 9:13 గంటల ప్రాంతంలో అందింది. “ఆపరేషన్ సింధూర్ విజయానికి గుర్తుగా మీ స్టేడియంలో బాంబు పేలుస్తాం” అంటూ ఆ మెయిల్‌లో హెచ్చరించడంతో…
HYDRA : హైదరాబాద్ నగరంలో హైడ్రా బలగాలు మరోసారి భారీగా కూల్చివేతల దాడులు చేపట్టాయి. ఈ సారి గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని మినీ హాల్, ఫుడ్ కోర్ట్స్‌తో పాటు అనేక అనుమతులు లేని నిర్మాణాలను తొలగించారు. ఉదయం నుంచే మూడు భారీ హిటాచ్ బుల్డోజర్ల సహాయంతో కూల్చివేతల ప్రక్రియ ప్రారంభమైంది. పోలీసులు ఘటనా స్థలంలో బందోబస్తును ఏర్పాటు చేసి, ఎవరికీ లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ కూల్చివేతలు ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా…
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులపై కాల్పులు జరపగా.. మొత్తంగా 28 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. ఈ ఉగ్రదాడిని భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. కానీ.. ఈ దాడిపై అస్సాంలో విపక్ష పార్టీ ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమినుల్ ఇస్లామ్ పాకిస్థాన్‌కు మద్దతు పలికాడు. ప్రస్తుత పెహల్గామ్ ఉగ్రదాడి, అంతకుముందు 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడి…
హైదరాబాద్ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. వీసా గడువు తీరిన చాలా మంది బంగ్లా, పాక్ దేశస్థులు హైదరాబాద్‌లో ఉన్నారన్నారు. వీరందరిని వెంటనే వెనక్కి పంపి వేయాలని డిమాండ్ చేశారు. వీరి ఏరివేతకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని సూచించారు. హైదరాబాద్ లో స్లీపర్ సెల్స్ ఉన్నారని గతంలో చాలా సందర్భాల్లో రుజువైందని.. స్లీపర్ సెల్స్ కు హైదరాబాద్ ఎంపీ మద్దతు ఉందని ఆరోపించారు.