Central Team: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల్లో ఒకటైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు ముంపు ప్రాంతాల్లో కేంద్రం బృందం పర్యటించింది.. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాల్లో వరద పరిస్థితి గురించి స్థానికులను అడిగి తెలుసుకుంది సెంట్రల్ టీమ్.. వరద ముంపును అంచనా వేసేందుకు వచ్చిన బృందం వేలేరుపాడు మండలంలోని రేపాకగొమ్ము, రుద్రంకోట, తాట్కూరుగొమ్ము గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు. 41.15 కాంటూరు పరిధిలో ముంపు గ్రామాల్లో వరద వచ్చిన సమయంలో ఉన్న పరిస్థితులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరదల సమయంలో తాము పడుతున్న ఇబ్బందులను నిర్వాసితులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. తమకు రావాల్సిన నష్టపరిహారం ఇచ్చేస్తే గ్రామాలు ఖాళీ చేసి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. కేంద్ర బృందంలో సీనియర్ కన్సల్‌టెంట్ (సీఐఐ) డాక్టర్ స్వాతి సులగ్న, డిప్యూటీ డైరెక్టర్ సీఐఐ అయినపర్తి జెస్సీ ఆనంద్, మరో ఇద్దరు సభ్యులు ఉన్నారు. రుద్రమ్మకోట, రేపాక గొమ్ము, తాటుకూరుగొమ్ము గ్రామాల్లో పర్యటించి 2022లో వరదలు ఎంత మేరకు వచ్చాయి? ప్రజలు ఎక్కడ రక్షణ పొందారు? లాంటి అంశాలపై ఆరా తీశారు..
Read Also: Delhi Elections: గతంలో బీజేపీ ఏం చేసిందో తెలిసిందే.. ఆరోపణలకు కట్టుబడి ఉన్నామన్న ఆప్