కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషాద ఘటన ఆదివారం జరిగింది. బాపులపాడు మండలం వీరవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తండ్రితో కలిసి పోలవరం కాలువలో చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు పోలవరం కాలువలో గల్లంతై ఇద్దరు యువకులు మృతి చెందినట్టు గుర్తించారు. మృతులు వీరవల్లి వాసులు షేక్ నాగూర్ భాష, (16) షేక్ షరీఫ్ (17)గా గుర్తించారు. పోలవరం కాలువ నుంచి మృతదేహాలను బయటికి తీయించి.. పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా.. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.