Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.. అయితే, ఇదే సమయంలో.. పోలవరాన్ని భారీ టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దేందుకు కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. పోలవరం ప్రాజెక్ట్ దగ్గర 15 ఎకరాల్లో రిసార్ట్ ఏర్పాటుపై దృష్టి సారించారు అధికారులు.. 255 కోట్ల రూపాయలతో రిసార్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.. వచ్చే ఏడాది నుంచి రిసార్ట్ పనులు ప్రారంభించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని చెబుతున్నారు.. పోలవరం ప్రాజెక్ట్ ను ఆనుకుని ఉన్న కొండ పై భాగంలో ఈ రిసార్ట్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి..
Read Also: Hyderabad: సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో చొరబాటు.. ఉగ్ర కోణంలో విచారణ
కాగా, ఓ వైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా జరిగేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. ఇదే సమయంలో పర్యాటక ప్రగతికి బాటలు వేయాలని నిర్ణయించింది.. ఏప్రిల్‌లో సీఎం చంద్రబాబు నాయుడు.. పోలవరం ప్రాజెక్టు పర్యటన నేపథ్యంలో అధికారులకు టూరిజం అభివృద్ధిపై ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత అధికారులు కొండలను కూడా పరిశీలించారు.. మరోవైపు, పుష్కరాల నాటికి పోలవరంలో పర్యాటక వైభావాన్ని తీసుకొచ్చేందుకు ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది.. ప్రాజెక్టు దగ్గర యూనిక్ వంతెన ఏర్పాటు చేయడంతోపాటు ప్రాజెక్టు దగ్గర ఉన్న నాలుగు కొండలపై సందర్శకుల విడిదికి అతిథి గృహాలు నిర్మించాలనే ప్లాన్ కూడా ఉందంటున్నారు.. ప్రాజెక్టు నుంచి పాపికొండలు, ధవళేశ్వరం వరకు పర్యాటకులను ఆకర్షించేలా అతిథి గృహాలు, బోటింగ్ ఏర్పాటు చేసేందుకు కూడా కసరత్తు జరుగుతోంది.