Minister Nimmala Ramanaidu: పోలవరంపై సమీక్ష.. డయాఫ్రమ్ వాల్ పనుల్లో 40 శాతం పురోగతి..!
- పోలవరం, ఎడమ, ప్రధాన కాలువ పనుల పురోగతిపై సమీక్ష..
- డయాఫ్రమ్ వాల్ పనుల్లో 40 శాతం పురోగతి సాధించాం..
- 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nimmala Ramanaidu: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ప్రాజెక్టుల్లో పోలవరం ఒకటి.. ఆ ప్రాజెక్టు పనుల పురోగతిపై ఎప్పటికప్పుడూ సీఎం చంద్రబాబు, మరోవైపు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు.. ఇక, ఇవాళ, పోలవరం, పోలవరం ఎడమ, ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.. సమీక్షలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి. సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల ఎస్‌ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు..
Read Also: Supriya Menon: ఏడేళ్ల వేధింపుల పై.. మౌనం వీడిన స్టార్ హీరో పృథ్వీరాజ్ భార్య
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ.. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40 శాతం పురోగతి సాధించాం అన్నారు.. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానల్స్ గాను, ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానల్స్ పూర్తి చేయడం జరిగింది. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా, డివాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్ కు పూర్తి చేస్తాం అన్నారు.. గ్యాప్-1 ఎర్త్ కమ్ రాక్‌ఫీల్ డ్యామ్ పనులు, 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయి. గ్యాప్-2 ఈసిఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సీడబ్ల్యూసీ మరియు పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్ కు పనులు మొదలు పెడతాం అని వెల్లడించారు.. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తిచేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకు వెళ్లేలా చంద్రబాబు లక్ష్యంకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని.. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జ్ ల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ఇక, గత ఐదు సంవత్సరాల పాలనలో పోలవరం ఎడమ కాలువకు ఒక్క రూపాయి గానీ, ఒక తట్ట మట్టి పనులు గానీ చేయలేదని విమర్శించారు మంత్రి నిమ్మల రామానాయుడు..
తాజావార్తలు
-
Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
-
Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
-
Land Pass Books: ‘భూదార్’ పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..