Polavaram Project: రెండోరోజు పోలవరం నిర్వాసితుల నిరసన దీక్ష.. పునరావాసం, నష్టపరిహారం డిమాండ్!
- రెండోరోజు పోలవరం నిర్వాసితుల నిరసన దీక్ష
- సమస్యలను పరిష్కరించాలని డిమాండ్
- ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించరాదని డిమాండ్
- ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని నినాదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం కొండమదులు పంచాయతీలోని గ్రామాలలోని పోలవరం నిర్వాసితులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏజెన్సీ గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రెండోవ రోజు రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమతో 2017 సంవత్సరంలో కుదుర్చుకొన్న ఎంఓయు ప్రకారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: AP Cabinet: కేబినెట్ సమావేశం నుంచి వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్.. కారణం ఏంటంటే?
Also Read
గ్రామాలు ఖాళీ చేసేనాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఆర్&ఆర్ అందించాలని కోరుతున్నారు. విలీన మండలాలతో సహా నిర్వాసితులందరికీ పూర్తి పునరావాసం కల్పించాలని, డి పట్టా సాగు చేస్తున్న ఆదివాసులకు పూర్తి నష్టపరిహారం అందజేయాలని నినాదాలు చేశారు. నేషనల్ పార్క్ పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించరాదని డిమాండ్ చేస్తున్నారు. నిర్వాసితుల అనుభవంలో ఉన్న కొండపోళ్ళు, విఎస్ఎస్‌లకు నష్ట పరిహారాలు అందించాలని కోరుతున్నారు. ఆదివాసుల జీవించే హక్కు, నివసించే హక్కులకు ఎలాంటి భంగం కలగరాదని.. కొండమొదలు పెద్దలతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని నినాదాలు చేస్తున్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదివాసీలు కోరుతున్నారు.
తాజావార్తలు
-
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సు కోసం ఢిల్లీకి చేరుకున్న పుతిన్.. నేడు మోడీతో కీలక భేటీ
-
Astrology: సెప్టెంబర్ 11 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికే డబ్బులే డబ్బులు..!
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?