పోలవరం విషయమై చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర నష్టం చేకూరిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. డయాఫ్రం వాల్ దెబ్బ తినడం వల్ల రూ. 2,200 కోట్ల మేర నష్టం వాటిల్లిందన్నారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆయన విమర్శించారు.
అనుమతి తీసుకుని పోలవరంలో ఎవరైనా పర్యటించవచ్చని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పద్దతి లేకుండా, తోకలేని కోతుల్లా ప్రాజెక్టులోకి వెళ్తామంటే ఉపేక్షించమని మంత్రి హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.
Ambati Rambabu: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై రకరకాల ప్రచారం సాగుతోంది.. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారని కొందరు? యథావిథంగా ఉంటుందని మరికొందరు చెబుతున్న మాట.. అయితే, పోలవరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చారు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలవరం ఎత్తు తగ్గిస్తామని అధికారులు సంతకాలు పెట్టారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పాడు.. ఇలా పచ్చి అబద్ధాలు…