AP Minister Ambati Rambabu Fires On Chandrababu Naidu Pawan Kalyan: ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్‌పై చంద్రబాబు విచ్చలవిడిగా మాట్లాడారని.. పవన్ కళ్యాణ్ ఏమో పోయిన తన చెప్పులు వెతుక్కుంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ అవాకులు చెవాకులు పేలారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఐదేళ్లు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించారని.. విజయవాడలో ఆ ఇద్దరు కలిసి 40 గుళ్లను కూల్చేశారని ఆరోపించారు. మారుమూల గ్రామాల్లోనూ బెల్ట్ షాపులు పెట్టారన్నారు. గంజాయి సాగులో చంద్రబాబు రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో పెట్టారని స్వయంగా టీడీపీ నేతలు గంటా, అయ్యన్నపాత్రుడే చెప్పారని గుర్తు చేశారు. గుడివాడలో టిడ్కో ఇళ్లను తానే కట్టానని చంద్రబాబు చెప్పుకుంటున్నాడని మండిపడ్డారు.
Mukesh Kumar Meena: ఆ ప్రచారం తప్పు.. ఓటర్ల తొలగింపుపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు
ఎవరికో పుట్టిన బిడ్డను తనకు పుట్టిన బిడ్డగా చెప్పుకునే వ్యక్తి జగన్ అని చంద్రబాబు అంటున్నాడని.. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకుని ముద్దాడే అలవాటు ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అంబటి రాంబాబు కౌంటర్ వేశారు. ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకున్న నువ్వు ఓ పనికి మాలినవాడివి అంటే, మళ్లీ ఏడుస్తాడంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్టీఆర్ పెట్టిన పార్టీని లాక్కుని ముద్దాడిన వాడు చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. పోలవరం తన బిడ్డ అని చంద్రబాబు అంటున్నాడని, నిజానికి పోలవరం వైఎస్ రాజశేఖర రెడ్డి కల అని చెప్పారు. చంద్రబాబు కరకట్ట ప్రకాష్ రాజ్ అని.. ప్రకాశ్ రాజ్ వేసే క్యారెక్టర్‌లను బట్టి ఈ పేరు చెబుతున్నానన్నారు. ప్రకాశ్ రాజ్ తప్పుగా అనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాజశేఖర రెడ్డి చేతిలో ఒకసారి, జగన్ చేతిలో ఒకసారి కౌరవ వధ జరిగిందని.. మరోసారి జగన్ చేతిలో కౌరవ వధ జరగనుందని.. అందుకే చంద్రబాబు గజగజా వణికిపోతున్నాడని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Raviteja: లీల పాపను వదలనంటున్న మాస్ మహారాజా..?