Nadendla Manohar: జూన్ 14 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభిస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nadendla Manohar Released Varahi Yatra Poster: గుంటూరులో జనసేన నేత నాదెండ్ల మనోహర్ సోమవారం సాయంత్రం వారాహి యాత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేనాధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14వ తేదీన కత్తిపూడి జంక్షన్ నుంచి వారాహి యాత్రను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన మొదలుపెడతారని చెప్పారు. ఈ యాత్రలో పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల్ని కలిసేలా ప్రణాళిక రచించినట్టు వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్ వారాహి యాత్ర కొనసాగనుందని.. ప్రతి రోజు ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని, వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ జనవాణి కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గతంలో 2 వేల అర్జీలను తాము అధికారులకు పంపామని, మేధావి వర్గంతో సమావేశాలు ఉంటాయని అన్నారు.
Kakani Govardhan Reddy: ఏం జరిగినా.. వైసీపీకి ఆపాదించడం పరిపాటిగా మారింది
Also Read
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్.. వైసీపీ పాలనలో జరుగుతున్న అరాచకాలను, ప్రజలకు జరిగిన నష్టాలను తెలియజేస్తారని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్.. జగననన్న పాపం పథకంగా మారిందని ఆరోపించారు. డబ్బుల కోసం పోలవరం ఎత్తు తగ్గించారని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం 17,140 కోట్ల నిధులను పోలవరం ప్రాజెక్టు కోసం రిలీజ్ చేసిందని గుర్తు చేశారు. పోలవరం ఎత్తు తగ్గించారని స్వయంగా కేంద్రమే చెప్పిందని చెప్పారు. ఎప్పుడూ లేనంతగా.. సీఎం జగన్ ఇప్పుడే హడావుడిగా పోలవరం పర్యటనకు ఎందుకు వెళ్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 14 వేల మంది నిర్వాసితులకు ఏ విధమైన న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రిటైనింగ్ వాల్ డ్యామేజికి కారణం ఏమిటి? అవినీతా, నాణ్యతా లోపమా? అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!