Polavaram Project: ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టుకు రూ.12,911 కోట్ల అదనపు నిధులు మంజూరు చేసింది కేంద్ర సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మంజూరైన రూ.12,911 కోట్లలో రూ. 2,000 కోట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండటం వల్ల జరిగిన అదనపు ఖర్చును కవర్ చేయడానికి కూడా నిధులు ఉన్నాయని పేర్కొన్నారు.. పోలవరం ప్రాజెక్టు మొదటి దశను పూర్తి చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.12,911 కోట్లు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఈ నిధుల పరిమాణాన్ని ఆమోదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మెమోరాండం జారీ చేసిందని అధికారులు తెలిపారు. కేంద్రంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చేసిన అలుపెరగని ప్రయత్నాలు, చర్చలు, సంప్రదింపుల ఫలితమే అని పేర్కొన్నారు.. ప్రాజెక్టు జాప్యానికి కారణమవుతున్నందున బిల్లుల చెల్లింపు నుండి మినహాయింపును అందించడంతోపాటు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మెమోరాండంను కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు పంపినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించి డ్యామ్ పనుల పురోగతిని సమగ్రంగా పరిశీలించి, ప్రధాన ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచేందుకు దెబ్బతిన్న డయాఫ్రమ్‌వాల్ మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించిన విషయం విదితమే. పోలవరం వద్ద వంతెన నిర్మాణంతో పాటు సందర్శకుల కోసం హోటల్‌ను నిర్మించడం మరియు ఇతర సౌకర్యాలను కల్పించడం ద్వారా ప్రాజెక్ట్ సైట్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
మరోవైపు.. పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిపై కేంద్రం వివరణ కోరింది.. గైడ్ వాల్‌లో పగుళ్లు ఏర్పడిన స్థితిని పెద్దదిగా చూపి.. “చిన్న నష్టం గురించి గందరగోళం” సృష్టిస్తున్నారని ఓ వర్గం మీడియాపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్.. కాగా, గైడ్ వాల్ డిజైన్‌లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపిందని, పగుళ్లపై సమాచారం అందిందని, సాంకేతిక సంఘం సూచనల మేరకు మరమ్మతులు చేపడతామని అధికారులు వివరించారు. 48 రేడియల్ గేట్లు, రివర్ స్లూయిస్ గేట్లు, పవర్ హౌస్ వద్ద టన్నెల్ పనులు, వైబ్రో కాంపాక్షన్, గ్యాప్ 1 వద్ద ఇసుక నింపడం, అలాగే ఎర్త్-కమ్-రాక్-ఫిల్ డ్యామ్‌కు ఇసుక రవాణా వంటి పనులను వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఎట్ గ్యాప్ 2 ప్రాంతం పూర్తయింది, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి కావస్తున్నాయని వివరించారు. అంతేకాకుండా, ఎగువ కాఫర్‌డ్యామ్ ఎత్తు పెంపుతో సహా డయాఫ్రమ్ వాల్‌కు అన్ని మరమ్మతులను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రికి నివేదించారు.