CM YS Jagan: ఇరిగేషన్‌పై సీఎం జగన్ సమీక్ష.. పోలవరం త్వరగా పూర్తి చేయాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan Review Meeting On Irrigation: ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇరిగేషన్‌పై మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా.. క్యాలెండర్ ప్రకారం రైతులకు సాగునీరు విడుదలచేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇప్పటికే గోదావరి, కృష్ణాడెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదలచేశామని వెల్లడించారు. అటు.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సమీపిస్తున్న తరుణంలో, లెఫ్ట్ మెయిన్ కెనాల్‌పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించారు. దీంతో.. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఈసీఆర్ఎఫ్ డ్యాం గ్యాప్-1లో శాండ్ ఫిల్లింగ్, వైబ్రోకాంపాక్షన్ పనులు పూర్తయ్యాయని అన్నారు. గ్యాప్-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు.
Adipurush: రావణుడి లుక్‌పై ట్రోలింగ్.. మైండ్ బ్లాకయ్యే సమాధానమిచ్చిన నిర్మాత!
Also Read
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్ బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని.. నేల స్వభావంలో మార్పల కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్ని కమిటీ వెల్లడించిందని అధికారులు సీఎంకు చెప్పారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్ డంప్‌తో, సిమెంట్ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని, ఆ మేరకు పనులు ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా.. చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టుగా అధికారులు వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ.12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని, కేంద్ర కేబినెట్‌లో పెట్టేందుకు కేబినెట్ నోట్ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని అన్నారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్న వివరించారు.
Adipurush: రావణుడి లుక్‌పై ట్రోలింగ్.. మైండ్ బ్లాకయ్యే సమాధానమిచ్చిన నిర్మాత!
ఈ సమావేశంలోనే.. ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవలని, ఈమేరకు కార్యాచరణ చేసుకుని వేగంగా వాటిని పూర్తిచేయాలని అన్నారు. వెలగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యత ప్రాజెక్టుల్లో పరిస్థితులను సమీక్షించిన తర్వాత.. ఈ ప్రాజెక్టుల ప్రగతిని ముఖ్యమంత్రికి అధికారులు నివేదించారు. అవుకు రెండో టన్నెల్ నిర్మాణం పూర్తి, చివరిదశలో లైనింగ్ కార్యక్రమం ఉందని.. ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరదజలాలను రాయలసీమ దుర్భిక్ష ప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని, వరదల సమయంలో సముద్రంలో కలవకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Sanath Nagar Steroids Case: జిమ్ ట్రైనర్స్‌కి అక్రమంగా డ్రగ్స్ సరఫరా.. ఒక వ్యక్తి అరెస్ట్
అలాగే.. వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోభివృద్ధిని సీఎంకి అధికారులు వివరించారు. ఇప్పటికే మొదటి టన్నెల్ పూర్తయ్యిందని, రెండో టన్నెల్ పనులు కూడా కొలిక్కి వస్తున్నాయని తెలిపారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్ రెగ్యులేటర్ పనులు పూర్తిచేస్తామని అన్నారు. టన్నెల్ తవ్వకం పనులు 18,787 మీటర్లకు గానూ, 17,461 మీటర్లు పూర్తి చేశామన్నారు. దీంతో.. నీటిని తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్ ఛానల్, తీగలేరు హెడ్ రెగ్యులేటర్, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయని ఈ సందర్భంగా అధికారులు చెప్పుకొచ్చారు.
Police Drags Bride: పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. పీటలపై నుంచి వధువుని లాక్కెళ్లిన పోలీసులు
వంశధార పనులపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది వంశధార స్టేజ్-2, ఫేజ్-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను పూర్తి చేస్తు్న్నామని అధికారులు చెప్పారు. గొట్టాబ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలని సీఎం సూచించారు. తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్, మహేంద్ర తనయ రిజర్వాయర్లపై కూడా సమీక్షించారు. ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు సీఎంకు తెలిపారు. కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయన్నారు. ఈ సందర్భంగా.. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్ అవార్డ్స్ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం అభినందించారు.
తాజావార్తలు
-
JoJo Glimpse : రాయలసీమ వర్షాలొస్తే వజ్రాలు దొరుకుతాయా?.. రచ్చ రేపుతున్న రస్టిక్ లవ్ స్టోరీ!
-
Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
-
Jim Jim Tara: జిమ్ జిమ్ తార ఫుల్ సాంగ్ రిలీజ్ చేసిన పర్ణశాల టీం
-
Aafiya Sayed: రుక్మిణి ఎవరో తెలిసింది.. నితిన్ లవర్‌గా సరికొత్త హీరోయిన్
-
L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!