Shaheed Bhagat Singh International Airport: గత ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో చండీగఢ్ విమానాశ్రయం పేరును షహీద్ భగత సింగ్ గా మారుస్తామని ప్రకటించారు. బుధవారం స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా చండీగఢ్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం పేరును షహీద్ భగత్ సింగ్ ఎయిర్ పోర్టుగా మార్చారు. ఈ కార్యక్రమానికి కేంద్రఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Read Also: Himachal Pradesh: కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్.. బీజేపీ గూటికి హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్
ఈ కార్యక్రమానికి హాజరుకావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని.. చండీగఢ్ ఎయిర్ పోర్టుకు స్వాతంత్య్ర సమరయోధుడి పేరును పెట్టాలని నిర్ణయించినందుకు ప్రధాని నరేంద్రమోదీకి ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో షహీద్ భగత్ సింగ్ వంటి ఎంతో మంది యువతీయువకులు త్యాగాన్ని ఇలా స్మరించుకుంటున్నామని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ గవర్నర్, బన్వరీ లాల్ పురోహిత్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి వీకే సింగ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హర్యానా హోం మంత్రి అనిల్ విజ్, చండీగఢ్ ఎంపీ కిరణ్ ఖేర్ హాజరు అయ్యారు.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్, చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలం పంజాబ్ ప్రభుత్వం.. చండీగడ్ ఎయిర్ పోర్టుకు భగత్ సింగ్ పేరు పెట్టాలని క్యాబినెట్ తీర్మానం చేసింది. దీని కన్నా ముందుగానే హర్యానా ప్రభుత్వం కూడా క్యాబినెట్ తీర్మాణం చేసి కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖకు పంపింది. తాజాగా ఈరోజు భగత్ సింగ్ 115వ జయంతి వేడుకల్లో భాగంగా ఎయిర్ పోర్టు పేరును మార్చారు.