Mahakaal Government: మధ్యప్రదేశ్ కేబినెట్ సమావేశంలో అరుదైన దృశ్యం కనిపించింది. ఈ భేటీలో ముఖ్యమంత్రి కుర్చీలో మహాకాలేశ్వరుడి ఫొటోను పెట్టారు. ఇది మహాకాలేశ్వరుడి ప్రభుత్వమని, ఇక్కడ ఆయనే రాజు అని, మహాకాల్ మహారాజు నేలపై నేతలందరూ సేవ కోసం వచ్చారని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉజ్జయినిలో మహాకాలేశ్వరుడి ఆలయం ఉన్న విషయం తెలిసిందే. అక్టోబర్ 11వ తేదీన ప్రధాని మోడీ మహాకాలేశ్వర్ ఆలయ కారిడార్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీలో మహాకాలేశ్వరుడి ఫొటోను పెట్టారు.
900 మీటర్ల కారిడార్‌లో దాదాపు 200 విగ్రహాలు, శివుడు, శక్తి, ఇతర మతపరమైన అంశాలకు సంబంధించిన కుడ్యచిత్రాలు ఉండనున్నాయి. జ్యోతిర్లింగ క్షేత్రమైన ఉజ్జయినిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగడం ఇదే మొదటిసారి.ప్రాజెక్టు మొదటి దశలో రూ.351 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. రెండో దశలో మరో ₹ 310.22 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాంప్లెక్స్‌కు ‘మహాకాల్ లోక్’ అని పేరు పెట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అక్టోబరు 11న ఉజ్జయినిలో స్థానిక సెలవు దినంగా ఉంటుందని ముఖ్యమంత్రి చౌహాన్ తెలిపారు.
Mundan Ceremony of Calf: దూడకు గుండు కొట్టించిన రైతు.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!
2018 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం టెండర్‌ను ఆహ్వానించిందని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన డిసెంబర్‌లో ప్రభుత్వం మారినందున అది కార్యరూపం దాల్చలేదని చౌహాన్ సమావేశంలో పేర్కొన్నారు. ఈ వాదనను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ తోసిపుచ్చారు.