ప్రధానమంత్రి 72వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు మోడీని ప్రశంసిస్తూ ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
నమీబియా నుంచి 8 చీతాలతో కూడిన ప్రత్యేక కార్గో బోయింగ్ 747 చార్టర్డ్ విమానం శనివారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లోని ఇండియన్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయింది. మహారాజ్పుర వైమానిక స్థావరంలో దిగిన ఈ చీతాలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్వాగతం పలికారు.
PM Modi holds bilateral talks with Russian President Putin: ఉజ్జెకిస్తాన్ లో జరుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సిఓ) సమావేశంలో పాల్గొనేందుకు సమర్ కండ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా, ఉక్రెయిన్ ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో తొలిసారిగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల కూడా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల యుగం…
SCO Summit: ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ వేదికగా షాంఘై సహకార సంస్థ(ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. అయితే ప్రపంచ అగ్ర రాజ్యాలైన చైనా, ఇండియా, రష్యా దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సభ్య దేశాల మధ్య సహాయసహకరాల, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలు చర్చకు వచ్చాయి. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య సమావేశం ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇరు నేతల మధ్య…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కొత్త మార్గదర్శనం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. ప్రధానిగా ఎన్నో ప్రదేశాలు పర్యటిస్తారని, ఎందరో ప్రధానిని కలుస్తుంటారు.. ఈ సమయంలో ప్రధానికి గౌరవంగా బహుమతులు ఇస్తుంటారని ఆయన తెలిపారు.
రెండు సంవత్సరాల కొవిడ్ పరిస్థితుల తర్వాత ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ 22వ శిఖరాగ్ర సమావేశం శుక్రవారం ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సమర్కండ్ చేరుకున్నారు.
షాంఘై సహకార సంస్థ(SCO) సభ్యదేశాల 22వ శిఖరాగ్ర సదస్సు గురువారం ఉజ్బెకిస్తాన్లోని చారిత్రక నగరం సమర్కండ్లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు నేడు,రేపు రెండు రోజుల పాటు జరగనుంది.
Asaduddin Owaisi comments on PM narendra modi: ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కు పెట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తీవ్రమైన సమస్యల నుంచి తప్పించుకునే విషయంలో ప్రధాని మోదీ చిరుతల కన్నా వేగంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజస్థాన్ జైపూర్ పర్యటకు వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలను చేశారు. జ్ఞాన్వాపి మసీదు-శృంగర్ గౌరీ కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రార్థనా స్థలాల చట్టానికి వ్యతిరేకంగా ఆయన అన్నారు.