Trinamool MP: ప్రధాని మోదీని అసురతో పోల్చిన టీఎంసీ ఎంపీ.. జైశంకర్‌పై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trinamool MP: తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్ మంగళవారం విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌పై విరుచుకుపడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీని ‘అసుర’తో పోల్చారు. జై శంకర్ తండ్రి కే సుబ్రహ్మణ్యం ప్రధాని నరేంద్ర మోదీని అసుర అని సంబోధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ మేరకు జవహర్ సిర్కార్ ట్విట్టర్ వేదికగా జైశంకర్ తండ్రి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. విమర్శలు గుప్పించారు. ఈ మేరకు జైశంకర్ తండ్రి కే.సుబ్రమణ్యం గుజరాత్ 2002 అల్లర్లల విషయంలో ధర్మ హత్య జరిగిందన్నారు. అమాయకులను రక్షించడంలో మోదీ విఫలమై అధర్మానికి పాల్పడ్డారన్నారన్నారు. కానీ ఆయన కొడుకు ఒక అసురుడిని సేవిస్తున్నందుకు సిగ్గుపడకుండా సరైన నిర్ణయం తీసుకుని బీజేపీలో చేరానని గర్వంగా చెబుతున్నాడంటూ జైశంకర్‌పై సిర్కార్ మండిపడ్డారు.
ఇదిలా ఉండగా.. జైశంకర్ విదేశాంగ కార్యదర్శి నుంచి విదేశాంగ మంత్రి తన రాజకీయ జీవితం గురించి ఏఎన్‌ఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 1980లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన తండ్రి కె సుబ్రహ్మణ్యంను కేంద్ర కార్యదర్శిగా తొలగించారని జైశంకర్ అన్నారు. రాజీవ్ గాంధీ హయాంలో తన తండ్రిని క్యాబినెట్ సెక్రటరీ పదవికి తన కంటే జూనియర్ ఎవరో నియమించారని విదేశాంగ మంత్రి తెలిపారు. కె సుబ్రహ్మణ్యం 1980లో డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్రటరీగా పనిచేశారు. 1980లో ఇందిరాగాంధీ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు తొలగించిన మొదటి కార్యదర్శి ఆయనే అని జైశంకర్ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే తాను బీజేపీలోకి ఎందుకు చేరానో కూడా వివరించారు. దీంతో తృణమాల్ కాంగ్రెస్ ఎంపీ జవహర్ సిర్కార్ విదేశాంగ మంత్రి మతిమరుపుతో బాధపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
Also Read
- RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
- Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
- Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
Read Also: CPI Narayana : అదానీ మాయల ఫకీరు కంటే దారుణంగా తయారయ్యాడు
నాడు తండ్రి చేసిన వ్యాఖ్యలను మర్చిపోయి.. గాంధీలపై ఉన్న అక్కసును మరోసారి జైశంకర్ బయటపెట్టుకున్నారని జవహర్ సిర్కార్ మండిపడ్డారు. ఆయన బీజేపీకి విధేయతగా పనిచేసి అత్యున్నత పదవులను పొందారన్నారు. బీజేపీ పదవి ఇచ్చినందుకు ఆ పార్టీని తలకెక్కించుకుని జైశంకర్ ఇలా మాట్లాడుతున్నాడా అంటూ జైశంకర్‌కు జవహర్ సిర్కార్ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.
S Jaishankar’s father, K Subramanyam said “Dharma was killed in Gujarat (2002 Riots).
Those who failed to protect innocent citizens are guilty of adharma.
Rama…would have used his bow against the ‘Asura’ rulers of Gujarat.”
Shame on son —serving Asura! https://t.co/rb5gkcerYs— Jawhar Sircar (@jawharsircar) February 21, 2023
తాజావార్తలు
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
-
Nirmala Sitharaman: యూపీఐపై గుడ్‌న్యూస్ చెప్పిన నిర్మలా సీతారామన్
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో సంచలనం.. అవామీలీగ్ విలీనానికి BNP ఎంపీ పిలుపు
-
YS Jagan: ‘దిశ’ లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
-
Liquor Closed: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ఎల్లుండి వైన్స్ బంద్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్‌ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!