PM Modi: వేసవిలో ప్రధాని మోదీకి జో బైడెన్ ప్రత్యేక ఆతిథ్యం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: అమెరికా ప్రెసిడెంట్ జో బిడెన్ ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర విందుకు ప్రత్యేక ఆతిథ్యం ఇవ్వబోతున్నారని సమాచారం. స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా భారత్-అమెరికా మధ్య బలపడుతున్న బంధానికి ఈ విందు ఓ కీలక సంకేతంగా నిలవనుంది. ఈ అంశంపై మాట్లాడేందుకు అమెరికా జాతీయ భద్రతా సమితి నిరాకరించింది. సెప్టెంబరులో ఢిల్లీలో గ్రూప్ ఆఫ్ 20 లీడర్స్ సమ్మిట్‌కు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ఇక్కడ ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రధాన చర్చనీయాంశాలలో ఒకటి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ సమావేశానికి హాజరవుతారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ మేలో ఆస్ట్రేలియా, జపాన్ నాయకులతో పాటు క్వాడ్ సమ్మిట్ కోసం సమావేశమైనప్పుడు ఆస్ట్రేలియాలో ప్రధాని మోడీతో బైడెన్ భేటీ కానున్నారు. ఇక, ఇటీవల కాలంలో బైడెన్ ప్రభుత్వం విదేశీ అతిథులకు ఇచ్చే మూడో విందుగా ఇది నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే డిసెంబర్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ఇక ఏప్రిల్ 26వ తేదీన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌సుక్ యోల్‌కు విందు ఏర్పాటు చేశారు. జూన్‌లో మోదీకి ఆతిథ్యం ఇచ్చేందుకు శ్వేతసౌధం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
- Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
- 10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
- Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
Read Also: Printing Fake Notes: మామూలోడు కాదు.. యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్లు ముద్రించాడు
అమెరికా భారత్ తో బంధాన్ని బలపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గత నెలలో బైడెన్ సర్కార్ భారత్‌తో ఇనీషియేటీవ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రకటించింది. దీని కింద కంప్యూటింగ్, జెట్ ఇంజిన్ల సంయుక్త అభివృద్ధి వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. భారత్‌పై రష్యా ప్రభావాన్ని తగ్గించడానికి అమెరికా తీసుకొన్న కీలక నిర్ణయంగా దీనిని భావిస్తున్నారు. ఇరు పార్టీల అమెరికా రాజకీయ నేతలు ప్రధాని మోదీతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?