Bhatti Vikramarka On His Padayatra: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌లకు బుద్ధి చెప్పడం కోసమే తాను పాదయాత్ర చేపట్టానని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రజల బాధలు అన్నీ ఇన్ని కావని.. ప్రభుత్వం నుంచి ఏ సహాయమూ తమకు అందండం లేదని ఆదివాసిలు తమ గోడు వెళ్లబోసుకున్నారని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాల్సింది పోయి.. తాము ఇచ్చిన భూముల్ని సైతం లాక్కుంటున్నారని ఆరోపించారు. పేదలకు రేషన్ కార్డు లేదు, తిండి లేదు.. కానీ దేశ సంపదను ఆదానికి మోడీ దోచి పెట్టారని ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని.. పార్లమెంట్ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉట్నూర్ టూ కేరమెరి రోడ్డు వేయించలేక ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీల జీవితాలను అల్లకల్లోలం చేసిందని.. ఐటీ డీఏలను నీర్వీయ్యం చేసిందని మండిపడ్డారు. నాటి బ్రిటిష్, నిజాం ప్రభుత్వం కంటే.. భయంకరమైన పరిస్థితులను ఆదివాసీలు ఎదుర్కుంటున్నారన్నారు. ఆదివాసీలను అడవుల నుంచి బయటకు పంపి, అడవిని ధ్వంసం చేసే మాఫియాను అడవుల్లోకి పంపారన్నారు. ఆదివాసీల హక్కుల కాలరాస్తున్నారన్నారు. పెద్ద ఉద్యమం పుట్టుకొచ్చే స్థాయిలో సమస్యలు ఉన్నాయన్నారు.
Manchu Manoj: మంచు మనోజ్ నోట ఆ మాట.. మౌనిక ఎమోషనల్..
ఇదే సమయంలో.. మంత్రి ఇంద్రకరణ్ చేసిన వ్యాఖ్యలపై భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. భాధ్యత కలిగిన మంత్రి పదవిలో ఉండి, పేపర్ లీక్ కావడం సాధారణమని అనడం ఏంటని ప్రశ్నించారు. మంత్రి ఇంద్రకరణ్ అడ్డగోలుగా మాట్లాడడం ఏంటన్న ఆయన.. పేపర్ లీక్ అవ్వకుండా ప్రభుత్వం చూడాల్సిందని సూచించారు. బుద్ది లేకుండా సర్వసాధారణం అనడం భాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం రాజీనామా చేసి తమకు అప్పగిస్తే 24 గంటల్లో ఆధారాలు ఇస్తామన్నారు. ఈడీ వేధిస్తోందని వ్యాఖ్యలు చేస్తున్నారని.. దర్యాఫ్తు సంస్థలకు సహకరించాలని కోరారు. ఇప్పటికే TSPSC బోర్డు, సెక్రెటరీని తొలగించాల్సి ఉండేదన్నారు. తాము టికెట్ ఇచ్చి ప్రచారం చేస్తే గెలిచి పార్టీ మారాడన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. అధికారంలో ఉండి ఎంత? లేకపోతే ఎంత? అని అన్నారు. ప్రశ్న పత్రాలు లీక్ చేసి మీకు కావాల్సిన వారికి అమ్మేసుకున్నారని.. ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ఉండడానికి వీల్లేదని అన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ను రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు నిలదీయాలని పిలుపునిచ్చారు. పేపర్ లీక్ సాధారణమని చెప్పి.. విద్యార్థి లోకాన్ని కించపరిచాడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అన్ని సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
Errabelli Dayakar Rao: విపక్షాలకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్.. ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదని ఫైర్