ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఆస్కార్ ఈవెంట్స్ లో తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఇంటర్నేషనల్ మీడియాని అట్రాక్ట్ చేశాడు చరణ్. నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత ముందుగా ఎన్టీఆర్, ఈరోజు రాజమౌళి అండ్ టీం హైదరాబాద్ వచ్చేసారు కానీ చరణ్ మాత్రం ఢిల్లీలో ల్యాండ్ అయ్యాడు. ఉపాసనతో పాటు ఢిల్లీలో ల్యాండ్ అయిన చరణ్ కి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఈరోజు సాయంత్రం రామ్ చరణ్ ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నాడు. ఈ కలయిక వెనక కారణం ఏంటని మెగా అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ప్రధాని మోదీ, చరణ్ మీటింగ్ వెనక ఉన్న అసలు కారణం… “ఇండియా టుడే కాంక్లేవ్” ఈవెంట్. ఢిల్లీలో జరగనున్న ఈ ఈవెంట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రికెట్ గాడ్ సచిన్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాల్గొనబోతోన్నారు. ‘ఐకాన్ ఆఫ్ ఇండియా’గా మోడీ ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా హాజరు కాబోతోన్నారు. రామ్ చరణ్ సైతం ఈవెంట్లో పార్టిసిపేట్ చేయబోతోన్నాడు. సచిన్, జాన్వీ కపూర్, మలైకా అరోరా ఇలా ఒక్కో రంగం నుంచి ప్రముఖ వ్యక్తులను ఈ ఈవెంట్‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
Read Also: RRR: జగజ్జేత ఇండియాకి తిరిగొచ్చాడు…