కర్ణాటకలోని బెలగావిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన(యూబీటీ) నేత, ఎమ్మెల్యే ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రధాని మోడీని కోరారు. బెలగావిలో మరాఠా మాట్లాడే ప్రజలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.
జమిలి ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఒక దేశం, ఒకే ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
అదానీ కేసుపై లోక్‌సభలో విపక్ష ఎంపీలు సోమవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరసన తెలిపారు. ఈ నిరసనలో కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. నిరసన సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక ప్రధాని మోడీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మాస్క్‌లు ధరించారు. వీరిద్దరినీ ఫొటోలు తీస్తూ.. హడావిడి చేస్తున్న వీడియోను రాహుల్ గాంధీ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. మోడీ, అదానీని ఉద్దేశించి..”వీరిది…
PM Modi: ది రైజింగ్ రాజస్థాన్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ 2024లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పెట్టుబడిదారుడు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీని చంపేస్తామని ముంబై పోలీసులకు శనివారం బెదిరింపు మెసేజ్‌లు వచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. అజ్మీర్‌కి చెందిన ఓ నెంబర్ నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు గుర్తించామని, నిందితుడిని పట్టుకునేందుకు అక్కడికి పోలీస్ టీంలను పంపామని అధికారి తెలిపారు.
పోప్ ఫ్రాన్సిస్ భారత్ పర్యటనకు వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ తెలిపారు. శనివారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ చేత కార్డినల్‌గా ఆర్చ్‌బిషప్ జార్జ్ జాకబ్ కూవకాడ్‌కు పట్టాభిషేకం జరగనుంది.
ఓట్లు, సీట్లు కారణంగానే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందలేదని ప్రధాని మోడీ విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలోని అష్టలక్ష్మి మహోత్సవ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు.
మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, ఏక్నాథ్ షిండే ప్రమాణం చేశారు.