Delhi Elections: త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. బీజేపీ, కాంగ్రెస్ విడతల వారీగా క్యాండిడెట్స్ పేర్లను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో వార్ నడుస్తుంది. అందంగా అలంకరించిన గుర్రంపై వరుడు లేని వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ.. బీజేపీ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని విమర్శించింది. దీనికి జవాబుగా కమలం పార్టీ స్పందిస్తూ దేశ రాజధానిలో త్వరలో బీజేపీ అధికారంలోకి వస్తుందని.. దీంతో ఢిల్లీ ప్రజలకు వచ్చిన ఆపద తొలగిపోతుందని సూచిస్తున్న పోస్టర్‌ను పోస్ట్ చేసింది.
Read Also: Jasprit Bumrah: ఈ ఓటమి చాలా బాధగా అనిపిస్తుంది.. నేను ఆడి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది
ఆప్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయి.. ఢిల్లీకి ప్రమాదంగా మారిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల విమర్శలు గుప్పించారు. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ రియాక్ట్ అవుతూ.. అసలు విపత్తు బీజేపీలోనే ఉందని ఎదురుదాడి చేశారు. మొదటి విపత్తు బీజేపీకి సీఎం అభ్యర్థి లేకపోవడం, రెండోది సరైన ఆలోచన లేకపోవడం, మూడోది అజెండా లేకపోవడం అని మండిపడ్డారు. అయితే, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. 2015 నుంచి రెండుసార్లు ఆప్ వరుసగా విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తుంది. ఇక, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఢిల్లీలోనూ ఈసారి పాగా వేయాలని చూస్తుంది. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం విడివిడిగా పోటీ చేస్తున్నాయి.
BJP वालों, तुम्हारा दूल्हा कौन है❓ pic.twitter.com/yHJCwKY4hb
— AAP (@AamAadmiParty) January 5, 2025
AAP-दा जाएगी, भाजपा आएगी#AAPदा_मुक्त_दिल्ली pic.twitter.com/zSiMbs4nQ7
— BJP Delhi (@BJP4Delhi) January 5, 2025