Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పవన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీకి రావాల్సిన నిధులు, విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వ సహకారంపై ప్రధానితో ఆయన చర్చించనున్నారు.
Telangana BJP: భారత రాజ్యాంగ దినోత్సవం నాడు తెలంగాణ బీజేపీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజ్యాంగ విలువలను అనుక్షణం కాపాడుతున్నారని చెప్పుకొచ్చింది.
ఆదాయపు పన్ను శాఖకు చెందిన పాన్ 2.0 ప్రాజెక్ట్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం ప్రకటించారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం కేబినెట్ నిర్ణయాలను అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
బ్రిటన్ కింగ్ చార్లెస్, సతీమణి క్వీన్ కెమిల్లా దక్షిణాసియా పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ దేశాలను సందర్శించే అవకాశం ఉంది.
PM Modi: నేడు (సోమవారం) శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ వెలుపల మీడియా పాయింట్ దగ్గర భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. పార్లమెంట్లో ఫలవంతమైన చర్చలు జరగాలని అధికార, విపక్ష సభ్యులను కోరారు.
మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్ మండపంలో యువజన ఆలోచనల మహాకుంభం ఉంటుందని ప్రధాని తెలిపారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సంచలన ఫలితాలు నమోదు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ‘‘మహాయుతి’’ కూటమి విజయం దిశగా దూసుకెళ్తోంది. రాష్ట్రంలోని మొత్తం 288 స్థానాలకు గానూ ప్రస్తుతం 220 కిపైగా స్థానాల్లో బీజేపీ+షిండే సేన+అజిత్ పవార్ ఎన్సీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రే సేన, శరద్ పవార్ ఎన్సీపీ కేవలం 54 స్థానాల్లోనే ఆధిక్యంలో ఉన్నాయి.
ప్రధాని మోడీ మూడు దేశాల పర్యటన ముగించుకుని శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. ఈ నెల 16న నైజీరియా, బ్రెజిల్, గయానా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. తొలుత ప్రధాని మోడీ నైజీరియాలో పర్యటించారు.