Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ఇటీవల తీవ్ర హింస చెలరేగింది. నగరంలోని షాహీ జామా మసీదు సర్వేకి వెళ్లిన అధికారులపై అక్కడి గుంపు రాళ్ల దాడికి పాల్పడింది. వేల మంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఈ హింసాత్మక ఘర్షణల్లో 30 మంది వరకు పోలీసులు గాయపడ్డారు.
తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వరదల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. తమిళనాడుకు సహాయ, సహకారాలు అందిస్తామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
PM Modi-Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ని భారత్‌లో పర్యటించాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించినట్లుగా ఆ దేశం ప్రకటించింది. 2025లో ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను నిర్ణయించనున్నట్లుగా క్రెమ్లిన్ సహాయకుడు యూరీ ఉసాకోవ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పుతిన్, పీఎం మోడీ ఏడాదికి ఒకసారి సమావేశాలు నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారని, ఈ సారి రష్యా వంతు అని భారతదేశంలోని రష్యా రాయబార కార్యాలయం తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సోమవారం సాయంత్రం 4 గంటలకు ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రాన్ని వీక్షించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రలో నటించారు. గుజరాత్‌లోని గోద్రా ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. న్యూఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధానమంత్రి ఈ చిత్రాన్ని వీక్షిస్తారు.
Donald Trump : తన పట్టాభిషేకానికి ముందు అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ దేశాలను బెదిరించారు. బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌కు బదులుగా బ్రిక్స్ కరెన్సీ లేదా మరేదైనా కరెన్సీకి మద్దతు ఇస్తే,
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫలితాలు కూడా వచ్చేశాయ్. మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఏర్పడలేదు.
PM Modi Letter To Palestine: పాలస్తీనా ప్రజలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లేఖ రాశారు. పాలస్తీనా అభివృద్ధికి తాము మద్దతుగా ఉంటుందని తెలిపారు. పాలస్తీనాలో కొనసాగుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు.
V. Hanumantha Rao: బీసీలకు న్యాయం జరగాలంటే కుల గణన జరగాలని కాంగ్రెస్ మాజీఎంపీ వి హనుమంతరావు అన్నారు. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ బీసీలకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
దేశ భద్రతా వ్యవహారాలపై ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని లోక్‌సేవాభవన్ కన్వెన్షన్ సమావేశ మందిరంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సదస్సు. ఈ సదస్సులో ఈరోజు ( నవంబర్ 30) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించనున్నారు.