Modi-Netanyahu: ప్రధాని నరేంద్రమోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూలు బుధవారం ఫోన్‌లో సంభాషించుకున్నారు. ఇరువురు నేతలు ‘‘న్యూ ఇయర్ శుభాకాంక్షలు’’ చెప్పుకున్నారు. భారత్-ఇజ్రాయిల్ వ్యూహాత్మక భాగస్వామ్యం, గాజా శాంతి ప్రక్రియపై , ఉగ్రవాదన్ని ఎదుర్కోవడంలో సహకారంపై చర్చించారు.
Read Also: India’s GDP: 2025-26లో భారత జీడీపీ వృద్ధి 7.4 శాతం..
ఇజ్రాయిల్-హమాస్ మధ్య సంఘర్షణ, అమెరికా ప్రతిపాదించిన పీస్ ప్లాన్ గురించి నెతన్యాహూ, మోడీకి వివరించారు. ఈ ప్రాంతంలో న్యాయమైన, శాశ్వత శాంతిని సాధించడానికి భారత్ మద్దతు ఉంటుందని నెతన్యాహుతో ప్రధాని మోడీ చెప్పారు. నెతన్యాహూతో ఫోన్ తర్వాత, ప్రధాని మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తన స్నేహితుడు నెతన్యాహూతో వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై మాట్లాడినట్లు చెప్పారు.
ప్రధాని మోడీతో మాట్లాడినట్లు నెతన్యాహూ కూడా ట్వీట్ చేశారు. మోడీని తన ప్రియమైన మిత్రుడిగా అభివర్ణించారు. భారత్-ఇజ్రాయిల్ సంబంధాలపై చర్చించినట్లు, రెండు దేశాల జాతీయ భద్రతను బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు, చర్చలు ఫలప్రదంగా సాగినట్లు నెతన్యాహూ చెప్పారు. వ్యక్తిగతంగా మోడీని కలవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన అన్నారు.
Glad to speak with my friend, Prime Minister Benjamin Netanyahu and convey New Year greetings to him and the people of Israel. We discussed ways to further strengthen the India-Israel Strategic Partnership in the year ahead.
We also exchanged views on the regional situation and…
— Narendra Modi (@narendramodi) January 7, 2026