Off The Record: ఏపీలో బీజేపీ అధికార, ప్రతిపక్ష పార్టీలు రెంటినీ రెండు కళ్ళతో కనిపెట్టి ఉంటోందా? అమరావతి రీ లాంఛ్ ప్రోగ్రామ్‌లో ప్రధాని మోడీ విపక్ష నేత జగన్‌ని పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం ఏంటి? సాధారణంగా ఎక్కడ మీటింగ్ జరిగినా… ఎన్డీయేతర పార్టీల మీద విరుచుకుపడే ప్రధాని ఏపీ మాత్రం… విమర్శల సంగతి తర్వాత కనీసం ప్రతిపక్ష నేత పేరు కూడా ఎందుకు ఎత్తలేదు? ఆ విషయమై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఏంటి?..
Read Also: Glowing Skin: ఈ చిన్న పని చేయండి.. ముఖంపై ఉండే మొటిమలను తగ్గించుకోండి!
అట్టహాసంగా జరిగిన అమరావతి రీ లాంఛ్ ప్రోగ్రామ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరయ్యారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే… ఇప్పటివరకు ఇచ్చిన, ఇస్తున్న నిధులు కాకుండా ప్రధాని నోటి నుంచి ప్రత్యేక నిధుల ప్రస్తావన వస్తుందని రాష్ట్రం వైపు నుంచి ఆశించినా… అ మాట మాత్రం చెప్పలేదాయన. అది వేరే సంగతి. ఆ సందర్భంగా జరిగిన సభలో ప్రధాని ప్రసంగం తీరుపై రకరకాల విశ్లేషణలు పెరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. సిఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ అదే వేదిక మీది నుంచి గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. వైసీపీ సర్కార్ రాజధానిని ధ్వంసం చేసిందంటూ ప్రధాని మోదీ ముందే మాట్లాడారు. గత ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదన కూడా మోదీకి తెలుసు కాబట్టి దాన్ని, దీన్ని పోల్చుకుంటూ విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. సాధారణంగా… ఇలాంటి టూర్స్‌కి వెళ్ళినప్పుడు అక్కడి ఎన్డీయే యేతర పార్టీలను టార్గెట్ చేస్తుంటారు ప్రధాని. కానీ, అమరావతికి వచ్చేసరికి ఇక్కడ ఆ పొజిషన్‌లో ఉన్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ను పల్లెత్తు మాట అనలేదాయన. విమర్శల సంగతి తర్వాత.. కనీసం ఆ పేరు కూడా ఎత్తకపోవడంపైనే చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో.
Read Also: Off The Record: మాజీ మంత్రి అనిత్ కుమార్ యాదవ్ వంతు వచ్చిందా..?
అయితే, రీ స్టార్ట్ మీటింగ్ జరిగి నాలుగు రోజులు గడిచినా.. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఇదే ట్రెండింగ్ సబ్జెక్ట్‌గా ఉండటాన్ని బట్టే ఈ విషయంలో ఏ స్థాయి చర్చ జరుగుతోందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. ఇంకా చెప్పాలంటే… ప్రధాని జగన్‌ను ఏమీ అనకపోవడంపై టీడీపీ లీడర్స్ కొందరు కుతకుతలాడిపోతున్నారట. అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి జగన్‌ను ఆహ్వానించినా.. ఆయన రాలేదన్నది టీడీపీ వాదన అయితే… అందుకు మా కారణాలు మాకున్నాయి టైం వచ్చినప్పుడు చెబుతామంటున్నారు వైసీపీ లీడర్స్. అయితే… ముఖ్య నాయకులంతా… అమరావతిలో గత ప్రభుత్వ విధ్వంసం, వందల కోట్ల ప్రజా ధనాన్ని వృధా చేశారన్న అర్ధం వచ్చేలా మాట్లాడినా…. ప్రధాని నోటి వెంట ఒక్క ముక్క కూడా రాకపోవడం ఏంటి? దాని వెనకున్న సంగతేంటంటూ సోషల్ మీడియా పోస్ట్‌లు కూడా తెగ పెరిగిపోతున్నాయట. బీహార్, తమిళనాడు, తెలంగాణ, కేరళ… ఇలా ఎక్కడ.. ఏ పర్యటకు వెళ్లినా.. ప్రతిచోట తమ ప్రత్యర్థి పార్టీల నేతలను ఎక్కువగా టార్గెట్ చేసి మాట్లాడే మోదీ జగన్ విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నది ఆసక్తికరమైన అంశమేనని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. నేరుగా ఎన్డీఏ కూటమిలో చేరకున్నా… 2019లో అధికారంలోకి వచ్చాక జగన్ ప్రధానికి బాగా దగ్గరయ్యారన్న ప్రచారం ఉంది.
Read Also: YS Jagan: రేపు పార్లమెంటరీ పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ..
కాగా, ఆ ఐదేళ్ళు బీజేపీకి రాజకీయంగా అవసరమైన ప్రతి సందర్భంలోనూ గట్టిగానే సపోర్ట్ చేసింది వైసీపీ. ఇక ఎన్నికలకు ముందు కుదిరిన పొత్తుతో ఇటు కూటమిలో టీడీపీతో భాగస్వామ్యం కలిశాక పరిస్థితిలో మార్పు వస్తుందని భావించారట ఎక్కువ మంది. కానీ… అమరావతిలో ప్రధాని ప్రసంగం చూస్తే మాత్రం… పాత బంధాన్ని పెద్దగా వదులుకున్నట్టు కనిపించడం లేదంటున్నారు విశ్లేషకులు. ఇందుకు తాజా ఉదాహరణను కూడా చెబుతున్నారు. వక్ఫ్ చట్టం విషయంలో వైసీపీ ఏదో… పైకి మాట్లాడినా, బీజేపీని అంత తీవ్రంగా విభేదించింది లేదని, పాత బంధం కొనసాగుతోందనడానికి అది కూడా ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినా… జగన్ ను ఇప్పటికీ తమ మిత్రుడిగానే భావిస్తున్నారు కాబట్టే మోదీ ఆయన్ని విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారన్నది కొందరి వాదన. మరి కొందరైతే… జగన్‌కు అంత విలువ ఇవ్వాలనుకోలేదు కాబట్టే… ఉద్దేశ్యపూర్వకంగా ఆయన్ని వదిలేసి ఉండవచ్చంటూ విశ్లేషిస్తున్నారు. ఆ మీటింగ్ జరిగిన మరుక్షణం నుంచి ఇలా రకరకాల వాదనలు తెర మీదికి వస్తూ…. ఎవరికి తోచింది వాళ్ళు సోషల్ మీడియా పోస్టింగ్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఇటు టీడీపీలో మాత్రం ఈ విషయమై అంతర్గత చర్చ గట్టిగానే జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. లోగుట్టు పెరుమాళ్ళకెరుక.