Khalistan Terrorist: కెనడా నుంచి హిందువులను పంపించేయండి.. ఖలిస్థానీల డిమాండ్!
- కెనడాలో రెచ్చిపోతున్న ఖలిస్థానీలు..
- కెనడా నుంచి హిందువులను పంపించేయాలని నిరసన..
- ప్రధాని మోడీ, అమిత్ షా, జైశంకర్ ఫోటోలను పంజరంలో బంధించిన ఖలిస్థానీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan Terrorist: కెనడా దేశంలో ఖలిస్థానీలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఆ దేశం నుంచి 8 లక్షల మంది హిందువులను వెనక్కి పంపించాలంటూ వేర్పాటు వాదులు టొరొంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు భారత ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జై శంకర్ బొమ్మలను అభ్యంతరకర రీతిలో ఓ పంజరంలో పెట్టారు.
Read Also: Sangareddy: ఇద్దరు పిల్లలకు ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి.. కారణం అదే!
Also Read
అయితే, ఇటీవల ఖలిస్థానీ మద్దతుదారులు ఓ మందిరంలో విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం జరిగింది. కెనడాలోని హిందూ సమాజానికి చెందిన ఓ నాయకుడు షవన్ బిండా ఈ వీడియోను ఎక్స్ (ట్విట్టర్) లో పోస్టు చేశారు. ఇది భారత ప్రభుత్వంపై చేస్తున్న ఆందోళన కాదు.. ఖలిస్థానీ గ్రూపునకు ఉన్న హిందూ వ్యతిరేకత అని పేర్కొన్నారు. కెనడాలో జరిగిన అతి భయంకరమైన దాడికి ఈ గ్రూపే కారణమని రాసుకొచ్చారు. కనిష్కా బాంబింగ్ ఘటనను గుర్తు చేస్తూ అతడు ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: CPI Narayana: బిగ్ బాస్, అందాల పోటీలతో స్త్రీ జాతికి కళంకం.. బ్యాన్ చేయాలి..!
కాగా, కెనడాకు చెందిన విలేకరి డానియల్ బోర్డమన్ కూడా హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ ఖలిస్థానీలు నిర్వహించిన కార్యక్రమం వీడియోను నెట్టింట షేర్ చేశారు. అంతేకాదు ఖలిస్థానీలపై చర్యలు తీసుకోవడంలో కొత్త ప్రధాని మార్క్ కార్నీకి.. మాజీ ప్రధాని ట్రూడోకు ఏమైనా తేడా ఉందా అని క్వశ్చన్ చేశారు. ఖలిస్థానీలు భారత్ కు చెందిన కేంద్ర మంత్రులను బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల రైల్వేశాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ బిట్టూను హత్య చేయడానికి కుట్రలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విషయాన్ని స్వయంగా అతడే వెల్లడించారు. సోషల్ మీడియాలో లీకైన కొన్ని స్క్రీన్ షాట్లు తన దృష్టికి వచ్చినట్లు తెలిపాడు. కేంద్ర మంత్రి అమిత్‌షాపై కూడా ఖలిస్థానీ సంస్థ వారిస్ పంజాబ్‌దే నాయకులు కక్ష పెంచుకొన్నట్లు చెప్పుకొచ్చాడు.
The Jihadis rampaging through our streets have done significant damage to the social fabric running around threatening any Jews they can find.
But the Khalistanis are giving them a good run for their money on most hateful foreign funded menace to society.
Will Mark Carney’s… https://t.co/c5ZuyTI6iz— Daniel Bordman (@DanielBordmanOG) May 4, 2025
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!