Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు, ముఖ్యంగా మతం ఆధారంగా హిందువుల్ని లక్ష్యంగా చేయడం పట్ల యావత్ దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ మేరకు పాకిస్తాన్‌పై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పహల్గామ్ ఉగ్ర దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాశ్మీర్ సమస్య చాలా ఏళ్లుగా ఉందని.. ఆ సమస్యనే పాకిస్థాన్-భారత్ పరిష్కరించుకోవాలని సూచించారు.
CM Chandrababu: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఏపీ సీఎం చంద్రబాబు కలిశారు. ఈ మేరకు ఉగ్రవాదులది పిరికిపంద చర్య, ఈ హింసను ఖండిస్తున్నామన్నారు. పహల్గామ్ బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తాం.. దేశ భద్రతను కాపాడే విషయంలో మోడీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది.
Iran: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే భారత్ పాక్‌కి వ్యతిరేకంగా దౌత్య యుద్ధాన్ని మొదలుపెట్టింది. ‘‘సింధు జల ఒప్పందం’’ని రద్దు చేసింది. సింధు, దాని ఉపనదుల నుంచి ఒక్క చుక్క నీరు పాక్‌కి వెళ్లకుండా ప్రణాళికలు రచిస్తోంది.
Pakistan: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా ఉన్న ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినట్లు ప్రకటించింది. అయినప్పటికీ, ఈ దాడి గురించి పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఖండన రాలేదు. దీనికి తోడు, భారత్ దాడి చేస్తే ప్రతిదాడి ఎలా చేయాలనే దానిపైనే దాయాది దేశం చూపు ఉంది. ఆ దేశం నుంచి ఉగ్రవాదులు వచ్చి దాడులకు పాల్పడినట్లు తెలిసినా కూడా తమ వారు కాదని ఇంకా బుకాయిస్తోంది.
Indus water: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో, పాకిస్తాన్‌కి సరైన రీతిలో బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. పాకిస్తాన్ జీవనాడి అయిన సింధు, దాని ఉపనదులు నుంచి ఒక్క చుక్క నీరు దక్కకుండా భారత్ వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్ భారత్ నిర్ణయాన్ని తప్పుబడుతూ.. ఇది ‘‘యుద్ధ చర్య’’గా అభివర్ణించింది. సింధు ఒప్పందాన్ని రద్దు చేసుకున్న నిర్ణయాన్ని భారత్, పాక్ ప్రభుత్వానికి అందించింది.
Hafiz Saeed: లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. సింధు నది జలాల ఒప్పందం రద్దు గురించి ఉగ్రవాది మాట్లాడిన వీడియోని ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) కావాలని వైరల్ చేస్తోంది.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మే 2వ తేదీన ఏపి రాజధాని అమరావతి పునర్నిర్మాణం పనులకు శంఖుస్థాపన కార్యక్రమం జరగనుంది.. ఈ శంఖుస్థాపన చేసేందుకు రావాలని ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు.
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకపు టూరిస్టులను ఉగ్రవాదులు పొట్టనుపెట్టుకున్నారు. కాశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చిన వారిని, మతం అడిగి హిందువులు అయితే కాల్చి చంపారు. ఈ ఘటనకు పాల్పడింది తామే అని పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరేతోయిబాకు చెందిన టీఆర్ఎఫ్ ప్రకటించింది.
Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్య చర్యలు తీసుకుంటున్న భారత్ మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.