పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఓసీ) పాకిస్థాన్ వరుస కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది.
ప్రధాని మోడీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కాంగ్రెస్ అధ్యక్షుడు కోరారు.
ఇక అమరావతి అభివృద్ధి అన్‌స్టాపబుల్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న 'వి లాంచ్పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్పో'కు హాజరైన సీఎం.. యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి దేశ్‌ముఖ్ బ్లాక్ నూతన భవనాలను ప్రారంభించారు..
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేంద్ర పెద్దలు భవిష్యత్ కార్యాచరణపై కీలక చర్చలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం ప్రధాని మోడీతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ భేటీ అయ్యారు.
India Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ దౌత్యచర్యలు మొదలుపెట్టింది. ఈ చర్యల్లో భాగంగా ‘‘సింధు జలాల ఒప్పందం’’ రద్దు చేసింది. పాక్ జాతీయులకు వీసాలు రద్దు చేయడంతో పాటు డెడ్‌లైన్ లోగా వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
Pakistan: పహల్గామ్ ఉగ్రవాద దాడికి కారణమైన పాకిస్తాన్ ఇప్పుడు వణుకుతోంది. భారత్ ఎలా స్పందిస్తుందో అని రోజులు లెక్కబెట్టుకుంటోంది. ముఖ్యంగా, పాకిస్తాన్‌ని కలిపి ఉంచేది ఆ దేశపు ఆర్మీ. అయితే, అలాంటి పాకిస్తాన్ ఆర్మీలోనే భారత్ దేశం అంటే భయం స్పష్టంగా కనిపిస్తోంది. భారత్ ఏ విధంగా తమపై విరుచుకుపడుతుందో తెలియక పాక్ ఆర్మీ నిలువెల్లా వణికిపోతోంది. ఇప్పటికే, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ జనానికి కనిపించకుండా ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వచ్చేనెల 2న ప్రధాని మోడీ అమరావతికి వస్తున్నారు... ప్రధాని రాక కోసం పూర్తిస్ధాయి ఏర్పాట్లు చేస్తోంది ఏపీ ప్రభుత్వం .. లక్షలాదిగా రైతులు, ప్రజలు తరలి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.. సెక్రటేరియట్ వెనుక స్ధలంలో అతిపెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు.. ఆ ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు..
BJP MP: తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన పాకిస్తాన్‌కి వార్నింగ్ ఇచ్చారు. 2025 నాటికి పాకిస్తాన్ ఒక దేశంలో ఉనికిలో లేకుండా పోతుందని చెప్పారు. ఆదివారం, ఆదివారం జార్ఖండ్‌లోని దేవఘర్ జిల్లాలో మహేశ్‌మార రైల్వే హాల్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో మాట్లాడుతూ, ఈ సంవత్సరం పాకిస్తాన్ 4 ముక్కలు అవుతుందని అన్నారు.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన భయంకరమైన ఉగ్రవాద దాడి తర్వాత కాశ్మీర్ టూరిజానికి ఆశ, ఊపిరిని తీసుకుస్తూ మళ్లీ పర్యాటకులు వస్తున్నారు. హహల్గామ్ దాడిలో 26 మంది టూరిస్టులు మరణించిన తర్వాత టూరిస్టుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, ఎలాంటి భయాలు లేకుండా టూరిస్టులు పర్యాటక ప్రాంతాలకు వస్తుండటం స్థానికుల్లో ఆనందానికి కారణమవుతోంది. గతంలో పోలిస్తే పర్యాటకుల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ ప్రాంతం మరోసారి దేశీయ , అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించడం ప్రారంభించింది. ఇటీవల ఉగ్రవాద…
Abhishek Banerjee: పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పించాల్సిన సమయం ఆసన్నమైందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీ ఆదివారం అన్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన మన భూభాగాలను తిరిగి పొందాలని అన్నారు. ఇక సర్జికల్ స్ట్రైక్స్ వద్దని పీఓకేని స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సూచించారు. "పాకిస్తాన్‌కి అర్థమయ్యే భాషలో వారికి పాఠం నేర్పాల్సిన సమయం ఇది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)ని తిరిగి పొందాల్సిన సమయం ఇది." అని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు.