Karumuri Nageswara Rao: ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పర్యటనపై సెటైర్లు వేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్న ప్రధాని మోడీ అమరావతికి వచ్చారని గుర్తుచేశారు.. అయితే, మొన్న వచ్చినప్పుడు (అమరావతి శంకుస్థాపనకు తొలిసారి వచ్చినప్పుడు) నీరు – మట్టి తీసుకొచ్చారు.. ఈసారి (అమరావతి రీలాంచ్) ఏదో ఇస్తారని ఆశించాం.. కానీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి చాక్లెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.
Read Also: CPI Narayana: అమరావతి పనులపై నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ బాధ్యత మోడీదే..!
ఇక, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్.. రైతు దగ్గర నుంచి ప్రతి ధాన్యం గింజ కూడా కొనాలని డిమాండ్ చేశారు కారుమూరి.. అలా కొనని పక్షంలో రైతులు వెంట ఉండి ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. రైతులకు చిరిగిపోయిన సంచులు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నారో చెప్పండి.. చిరిగిపోయిన సంచలిచ్చి రైతులకు ఏమి చేస్తారు అని మండిపడ్డారు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరావు.. కాగా, అమరావతిలో ఏర్పాటు చేసిన సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కి ప్రధాని మోడీల మధ్య ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్న విషయం విదితమే.. సభా వేదికపై ముఖ్య నేతలందరూ కూర్చొని ఉండగా.. ప్రధాని మోడీ.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలవడంతో.. పవన్ హడావిడిగా ఆయన దగ్గరికి వెళ్లారు.. తర్వాత ప్రధాని తన వద్ద ఉన్న చాక్లెట్ ను తీసి పవన్ కల్యాణ్‌కు ఇవ్వడంతో వేదికపై ఉన్న వారితో పాటు, సభ ప్రాంగణంలో ఉన్న వారి మధ్య నవ్వులు పూసాయి.. చాక్లెట్ ఇచ్చిన తర్వాత.. మొదట ప్రధాని, సీఎం చంద్రబాబు నవ్వారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ ను చూసి వారితో కలిసి నవ్వేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న విషయం విదితమే..