Toxic : టాక్సిక్ టీజర్ రిలీజ్.. థియేటర్స్ తగలబడతాయేమో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ బడ్జెట్ టాక్సిక్. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ మధ్య యష్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన గ్లిమ్స్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మేకర్స్ ముందుగా చెప్పినట్టుగానే, ఈ టీజర్ ఊహించిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఇంటెన్స్‌గా, పవర్‌ఫుల్ విజువల్స్‌తో ఉంది.
Also Read
దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని ఒక పక్కా గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెకెక్కించింది. టీజర్‌లోని వయలెన్స్ మరియు షాట్స్ చూస్తుంటే, ఈ సినిమా ఖచ్చితంగా ‘A’ సర్టిఫికేట్ పొందే రేంజ్‌లో రాబోతుందని స్పష్టమవుతోంది. మునుపెన్నడూ చూడని విధంగా యష్ బాడీ లాంగ్వేజ్ మరియు లుక్స్ ఇందులో చాలా వైల్డ్ గా ఉన్నాయి. ఈ టీజర్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గురించి. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా రవి బాసృర్ ఇచ్చిన సంగీతం అదిరిపోయింది. విజువల్స్ విషయానికి వస్తే, కొన్ని షాట్స్ అత్యున్నత ప్రమాణాలతో షూట్ చేశారు. సినిమాటోగ్రఫీ మరియు కలర్ గ్రేడింగ్ సినిమా మూడ్‌కు తగ్గట్టుగా చాలా డార్క్‌గా, ఇంటెన్స్‌గా ఉన్నాయి. మొత్తానికి ‘కేజీఎఫ్’ తర్వాత యష్ నుంచి వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరో సునామీ సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!